US warns:జవహరి హత్యానంతరం అమెరికా పౌరులకు విదేశాంగశాఖ హెచ్చరిక

ABN , First Publish Date - 2022-08-03T12:46:21+05:30 IST

అల్ కాయిదా చీఫ్( AlQaeda chief) అల్ జవహరిని(Ayman al-Zawahiri) చంపిన తర్వాత ఆ ఉగ్రవాద సంస్థ ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉందని(possible retaliation) అమెరికా హెచ్చరించింది...

US warns:జవహరి హత్యానంతరం అమెరికా పౌరులకు విదేశాంగశాఖ హెచ్చరిక

వాషింగ్టన్ (యూఎస్): అల్ కాయిదా చీఫ్( AlQaeda chief) అల్ జవహరిని(Ayman al-Zawahiri) చంపిన తర్వాత ఆ ఉగ్రవాద సంస్థ ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉందని(possible retaliation) అమెరికా హెచ్చరించింది(US warns).జవహరి హతం అనంతరం అల్ కాయిదా దాని మద్ధతుదారులు ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉందని విదేశాల్లో ప్రయాణిస్తున్న అమెరికన్ పౌరులు( US citizens) జాగ్రత్తగా ఉండాలని అమెరికా విదేశాంగ శాఖ హెచ్చరించింది. 


జులై 31వతేదీన అల్ జవహరిని హతమార్చిన తర్వాత ఉగ్రవాద దాడులు హెచ్చరిక లేకుండానే జరుగుతాయని, అందువల్ల అమెరికా పౌరులు విదేశాలకు వెళ్లినపుడు అప్రమత్తంగా ఉండాలని యూఎస్ జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ సూచించారు. యూఎస్ ప్రయోజనాలకు వ్యతిరేకంగా అల్ కాయిదా ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశాలున్నాయని యూఎస్ పౌరులందరూ జాగ్రత్తగా ఉండాలని యూఎస్ తాజాగా హెచ్చరిక జారీ చేసింది.


Updated Date - 2022-08-03T12:46:21+05:30 IST