భారత టాప్ వ్యాపార భాగస్వామిగా.. రెండో ఏడాదీ అగ్రరాజ్యమే!

ABN , First Publish Date - 2020-07-13T04:40:43+05:30 IST

భారత అత్యుత్తమ వ్యాపార భాగస్వామిగా రెండో ఏడాదీ అమెరికానే నిలిచింది.

భారత టాప్ వ్యాపార భాగస్వామిగా.. రెండో ఏడాదీ అగ్రరాజ్యమే!

న్యూఢిల్లీ: భారత అత్యుత్తమ వ్యాపార భాగస్వామిగా రెండో ఏడాదీ అమెరికానే నిలిచింది. ఈ రెండు దేశాల మధ్య వరుసగా రెండో ఆర్థిక ఏడాది కూడా భారీగా ద్వైపాక్షిక వ్యాపారం జరిగింది. ఈ ఏడాది 88.75 బిలియన్ డాలర్ల వ్యాపారం జరిగిందని అధికారిక గణాంకాలు చెప్తున్నాయి. అయితే 2018-19లో మన రెండు దేశాల మద్య 87.96 బిలియన్ డాలర్ల వ్యాపారం జరిగిందని తెలుస్తోంది. గతంలో భారత అత్యుత్తమ వ్యాపార భాగస్వామిగా చైనా ఉండేది.


2018-19లో ఈ రెండు దేశాల మధ్య జరిగిన వ్యాపార లావాదేవీలు 87.08 బిలియన్ డాలర్లకు చేరాయి. దీంతో చైనాను దాటిన అమెరికా భారత అత్యుత్తమ వ్యాపార భాగస్వామిగా అవతరించింది. ఈ ఆర్థిక సంవత్సరం చైనాతో వ్యాపారం 81.87 బిలియన్ డాలర్లకు పడిపోయింది. అదే సమయంలో అమెరికాతో మాత్రం 88.75 బిలియన్ డాలర్ల విలువైన వ్యాపార లావాదేవీలు జరిగాయి.

Updated Date - 2020-07-13T04:40:43+05:30 IST