Abn logo
Oct 23 2020 @ 09:23AM

రష్యా నుంచి బైడన్‌కు మిలియన్ డాలర్ల సాయం: ప్రెసిడెన్షియల్ డిబేట్‌లో ట్రంప్

Kaakateeya

వాషింగ్టన్: ట్రంప్, జోబైడన్ మధ్య మూడో ప్రెసిడెన్షియల్ డిబేట్ జరిగింది. నాష్‌విల్లేలో ఇద్దరు అభ్యర్థుల మధ్య ముఖాముఖి చర్చ జరిగింది. ఈ చర్చలో భాగంగా బైడన్‌పై ట్రంప్ తీవ్ర ఆరోపణలు చేశారు. రష్యా నుంచి బైడన్‌కు మిలియన్ డాలర్ల సాయం అందుతోందని ట్రంప్ ఆరోపించారు. తన జీవితంలో ఏ దేశం నుంచీ ఒక్క డాలర్ కూడా తీసుకోలేదని ట్రంప్ చెప్పుకొచ్చారు. తనకు వ్యాపారాలున్నాయని, మిలియన్ డాలర్ల పన్నులు చెల్లిస్తున్నానని డొనాల్డ్ ట్రంప్ డిబేట్‌లో వ్యాఖ్యానించారు.

కరోనాను సమర్థంగా ఎదుర్కొన్నామని, అమెరికాలో కరోనా మరణాల రేటు తగ్గిందని ట్రంప్ చెప్పుకొచ్చారు. కొన్ని ప్రాంతాల్లోనే కరోనా కేసులు పెరుగుతున్నాయాని, కొన్ని వారాల్లోనే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఆర్మీ సాయంతో వ్యాక్సిన్ పంపిణీ చేస్తామని, త్వరలోనే విద్యాసంస్థలు తెరుస్తామని డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.

Advertisement
Advertisement