అమెరికా అధ్యక్ష అభ్యర్ధి బిడెన్ ప్రచారం తెలుగులో

ABN , First Publish Date - 2020-08-02T01:27:02+05:30 IST

అమెరికా అధ్యక్ష పదవికి నవంబర్ మొదటి వారంలో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో... ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్ధులు నానా ప్రయత్నాలూ చేస్తున్నారు. ఇందులో భాగంగా... దేశ ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు తీవ్ర పోటీనిస్తోన్న బిడెన్... ఎన్నికలలో తమదైన పాత్ర పోషించనున్న భారతీయ-అమెరికన్‌లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

అమెరికా అధ్యక్ష అభ్యర్ధి బిడెన్ ప్రచారం తెలుగులో

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష పదవికి నవంబర్ మొదటి వారంలో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో... ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్ధులు నానా ప్రయత్నాలూ చేస్తున్నారు. ఇందులో భాగంగా... దేశ ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు తీవ్ర పోటీనిస్తోన్న బిడెన్... ఎన్నికలలో తమదైన పాత్ర పోషించనున్న భారతీయ-అమెరికన్‌లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.


ఇదే క్రమంలో... డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధి బిడెన్ తన ప్రచారాన్ని భారతీయ భాషల్లోనూ నిర్వహిస్తుండడం విశేషం.  బిడెన్ జాతీయ ఆర్థిక కమిటీ సభ్యుడు అజయ్ భూటోరియా ఆయనకు ఈ క్రమంలో సహాయంగా నిలిచారు. హిందీ, పంజాబీ, తమిళం, తెలుగు, బెంగాలీ, ఉర్దూ, కన్నడ, మలయాళీ, ఒరియా, మరాఠీలతోపాటు నేపాలీ భాషలోనూ ప్రసంగించేందుకు బిడెన్ యత్నిస్తున్నారు.


ఈ క్రమంలోనే... తెలుగులోనూ ఆయన ప్రసంగిస్తున్నారు. ఇక... భారతీయ-అమెరికన్ ఓటర్లను ప్రభావితం చేయడానికి మిస్టర్ బిడెన్ ‘అమెరికా కా నేత కైసే హో... జో బిడెన్ జైసా హో(అమెరికా అధ్యక్షుడు... జో బిడెన్ మాదిరిగా ఉండాలి)’ అన్న నినాదం తో ప్రచారం చేస్తుండడం విశేషం. ఇక మధ్యమధ్యలో తెలుగు పదాలనూ బిడెన్ వాడుతుండడం గమనార్హం. ‘మీ ఓటు... నాకివ్వండి’ అని ఆయన అడుగుతున్నారు. 


Updated Date - 2020-08-02T01:27:02+05:30 IST