కొంతమంది మనుషులు అకారణంగా ఇతరులను బాధపెడుతుంటారు. అందులో తమ సంతోషాన్ని వెతుక్కుంటారు. చెత్త పనులు చేసి ఆనందం అనుభవిస్తుంటారు. తాజాగా అమెరికాలో ఇలాంటి ఘటనే జరిగింది. ఓక్లహామా నగరంలోని ఓ సూపర్ మార్కెట్‌కు వెళ్లిన మహిళ తనకు కావాల్సిన సామన్లు కొనుక్కొని అక్కడున్న ఓ ఫ్రీజర్ తెరిచింది.
ఇవి కూడా చదవండి
అందులో పిజ్జా రోల్ కోసం వెతికుతూ ఓ ప్యాకెట్ తీసుకుంది. అందులో మానవ వ్యర్థాలను చూసి షాకైపోయింది. వెంటనే తీవ్రంగా ఇబ్బందిపడుతూ సూపర్ మార్కెట్ యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. యాజమాన్యం వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. సూపర్‌మార్కెట్‌లోని సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా ఓ వ్యక్తి ఆ ప్యాకెట్‌ను ఫ్రీజర్‌లో పెట్టినట్టు స్పష్టంగా కనిపించింది. దీంతో పోలీసులు అతడిని అన్వేషిస్తున్నారు. తీవ్ర అసౌకర్యానికి గురైన మహిళకు సూపర్ మార్కెట్ యాజమాన్యం క్షమాపణలు చెప్పింది.