Canadaలో మంకీపాక్స్ ఫస్ట్ కేసు...US Confirms

ABN , First Publish Date - 2022-05-19T14:41:38+05:30 IST

అమెరికా నుంచి కెనడా దేశానికి వెళ్లిన ఓ వ్యక్తికి మంకీపాక్స్ సోకిందని యునైటెడ్ స్టేట్స్ తాజాగా ధృవీకరించింది....

Canadaలో మంకీపాక్స్ ఫస్ట్ కేసు...US Confirms

మాంట్రియల్(కెనడా): అమెరికా నుంచి కెనడా దేశానికి వెళ్లిన ఓ వ్యక్తికి మంకీపాక్స్ సోకిందని యునైటెడ్ స్టేట్స్ తాజాగా వెల్లడించింది.కెనడాలోని క్యూబెక్ ప్రావిన్స్‌లోని ఆరోగ్య అధికారులు 12పైగా అనుమానాస్పద మంకీపాక్స్ కేసులను గుర్తించి చికిత్స చేస్తున్నారు.ఈ వారం ప్రారంభంలో యూరోపియన్ ఆరోగ్య అధికారులు డజన్ల కొద్దీ మంకీపాక్స్ కేసులను గుర్తించారు.మంకీ పాక్స్ వల్ల తరచూ జ్వరం, కండరాలనొప్పి, ఫ్లూ లాంటి లక్షణాలతో అనారోగ్యం బారిన పడతారని యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది.క్యూబెక్ నగరంలోని మాంట్రియల్‌లోని ప్రజారోగ్య అధికారులు 13 మంకీ పాక్స్ కేసులకు చికిత్స చేస్తున్నారు. ఈ వ్యాధి సోకిన వారికి వచ్చిన పుండ్ల వల్ల ఇతరులకు వ్యాధి వ్యాప్తి చెందుతుందని మసాచుసెట్స్ ఆరోగ్య అధికారులు చెప్పారు.


పోర్చుగల్, స్పెయిన్, బ్రిటన్‌లలో గత రెండు వారాలుగా మంకీపాక్స్‌ను కనుగొన్నారు.యూరప్ దేశాల్లో పురుషులతో లైంగిక సంబంధం కలిగి ఉన్న పురుషుల్లో పలు కేసులు కనుగొన్నారు.మే 6 వతేదీ నుంచి యునైటెడ్ కింగ్‌డమ్‌లో 9 మంకీపాక్స్ కేసులు కనుగొన్నారు.స్పెయిన్, పోర్చుగల్ దేశాల్లో కూడా 40 కంటే ఎక్కువ మందికి మంకీపాక్స్ కేసులు బయటపడ్డాయి.


Updated Date - 2022-05-19T14:41:38+05:30 IST