‘యూపీఎస్సీ’ వాయిదా వేయాలి: సుప్రీంలో పిల్‌

ABN , First Publish Date - 2020-09-25T08:17:22+05:30 IST

కరోనా, వరదల నేపథ్యంలో యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ) పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది...

‘యూపీఎస్సీ’ వాయిదా వేయాలి: సుప్రీంలో పిల్‌

న్యూఢిల్లీ, సెప్టెంబరు 24: కరోనా, వరదల నేపథ్యంలో యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ) పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ పరీక్షలను కనీసం రెండు మూడు నెలలు వాయిదా వేయాలని, అప్పటికి వరదలు తగ్గుముఖం పడతాయని, కరోనా కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుందని వాసిరెడ్డి గోవర్ధన్‌సాయితోపాటు మరో 50మంది  కలిసి దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. జస్టిస్‌ ఏఎం ఖన్వీల్కర్‌, జస్టిస్‌ సంజయ్‌ ఖన్నా బెంచ్‌ విచారణకు స్వీకరించింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని, యూపీఎస్సీని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది.

Updated Date - 2020-09-25T08:17:22+05:30 IST