బాలికకు మాయ మాటలు చెప్పి ఇంటికి తీసుకొచ్చింది.. భర్త కోసం ఆ భార్య ఏం చేసిందంటే..

ABN , First Publish Date - 2021-08-16T18:05:13+05:30 IST

ఆ మహిళ ఘోరం చేసింది.. కూతురి వయసున్న బాలికకు మాయ మాటలు చెప్పింది..

బాలికకు మాయ మాటలు చెప్పి ఇంటికి తీసుకొచ్చింది.. భర్త కోసం ఆ భార్య ఏం చేసిందంటే..

ఆ మహిళ ఘోరం చేసింది.. కూతురి వయసున్న బాలికకు మాయ మాటలు చెప్పింది.. అనంతరం ఇంటికి తీసుకొచ్చి ఆమెకు నరకం చూపించింది.. భర్త కోసం ఆ చిన్నారిని ఎరగా వేసింది.. భార్య ఎదురుగానే ఆ బాలికను భర్త అత్యాచారం చేశాడు.. ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లా ప‌శ్చిమ స‌రీరా పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలోని ఓ కాలనీలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై ఆ ప్రాంతంలో ఆగ్రహ జ్వాలలు రగులుతున్నాయి. 


కౌశాంబి జిల్లా ప‌శ్చిమ స‌రీరాకు చెందిన ఓ మహిళ 16 ఏళ్ల దళిత బాలికతో పరిచయం పెంచుకుంది. ఆమెకు మాయ మాటలు చెప్పి తన ఇంటికి తీసుకెళ్లింది. అక్కడ తన భర్త చేత ఆమెను అత్యాచారం చేయించింది. తన భార్య ముందే నిందితుడు సదరు బాలిక‌పై అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. అనంతరం ఈ విషయం ఎవరికైనా చెబితే కుటుంబం మొత్తాన్ని చంపేస్తామని బెదిరించారు. 


దీంతో బాలిక తనపై అత్యాచారం జరిగిన విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. అయితే బాలిక విచారంగా ఉండడాన్ని గమనించిన తల్లి నిలదీయడంతో ఆమె విషయం మొత్తం చెప్పేసింది. దీంతో బాలిక తల్లి పోలీసులను ఆశ్రయించింది. అయితే పోలీసులు ఆ కేసు తీసుకోవడానికి నిరాకరించారు. దీంతో బాధితురాలి తల్లి నేరుగా కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు సాగిస్తున్నారు. ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

Updated Date - 2021-08-16T18:05:13+05:30 IST