ఫత్వా తర్వాతే టీకా: దేవ్‌బంద్‌

ABN , First Publish Date - 2020-12-26T08:35:09+05:30 IST

కరోనా టీకా వేసుకునేముందు తాము ఫత్వా జారీ చేస్తామని, అప్పటిదాకా ముస్లింలు వేచి చూడాలని యూపీలోని దారుల్‌ ఉలూమ్‌ దేవ్‌బంద్‌ సంస్థ పేర్కొంది...

ఫత్వా తర్వాతే టీకా: దేవ్‌బంద్‌

న్యూఢిల్లీ, డిసెంబరు 25: కరోనా టీకా వేసుకునేముందు తాము ఫత్వా జారీ చేస్తామని, అప్పటిదాకా ముస్లింలు వేచి చూడాలని యూపీలోని దారుల్‌ ఉలూమ్‌ దేవ్‌బంద్‌ సంస్థ పేర్కొంది. టీకా తయారీలో పంది మాంసం నుంచి తీసిన గెలాటిన్‌ను ఉపయోగించారని ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో దేవ్‌బంద్‌ ప్రతినిధి మాట్లాడారు. టీకాలో ఏం వాడారు? దాన్ని ఇస్లాంలో అనుమతించారా లేదా? అనేది పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. వైర్‌సకు విరుగుడుగా వచ్చే వ్యాక్సిన్‌ ముస్లింలకు సురక్షితమైనదా కాదా? అనేది ఫత్వా విభాగం నిర్ణయిస్తుందని తెలిపారు.


వ్యాక్సిన్‌ను సురక్షితంగా నిల్వ చేసేందుకు, రవాణా చేసేందుకు పంది మాంసం నుంచి తీసిన గెలాటిన్‌ను స్టెబిలైజర్‌గా ఉపయోగిస్తారని చెప్పారు. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ వేసుకునే ముందు ఫ త్వా కోసం వేచి ఉండాలని ముస్లింలకు పిలుపునిచ్చారు. మరోవైపు పంది మాంసం నుంచి తీసిన గిలెటిన్‌ ఉన్నాసరే ముస్లింల కోసం ఆ వాక్సిన్‌లను ఆమోదిస్తామని యూఏఈలోని ఫత్వా కౌన్సిల్‌ ప్రకటించడం విశేషం.

Updated Date - 2020-12-26T08:35:09+05:30 IST