Viral News: ప్రేయసి మాటలు విని.. ఆమెను కలిసేందుకు బుర్కా ధరించాడు.. చివరికి అతడికి పట్టిన గతి ఇదీ!

ABN , First Publish Date - 2022-08-19T14:11:30+05:30 IST

‘నిన్ను ఒకసారి చూడాలని అనిపిస్తుంది’ అంటూ అతడు తన ప్రేయసికి సందేశం పంపాడు. దీంతో అతడి బాధను అర్థం చేసుకున్న ఆ యువతి.. తన బుర్రకు పదును పెట్టింది. ‘బుర్కా ధరించి నేరుగా మా ఇంటికి వచ్చేయ్’ అనే సందేశాన్ని అతడికి చేరవేసింది. ఈ

Viral News: ప్రేయసి మాటలు విని.. ఆమెను కలిసేందుకు బుర్కా ధరించాడు.. చివరికి అతడికి పట్టిన గతి ఇదీ!

ఇంటర్నెట్ డెస్క్: ‘నిన్ను ఒకసారి చూడాలని అనిపిస్తుంది’ అంటూ అతడు తన ప్రేయసికి సందేశం పంపాడు. దీంతో అతడి బాధను అర్థం చేసుకున్న ఆ యువతి.. తన బుర్రకు పదును పెట్టింది. ‘బుర్కా ధరించి నేరుగా మా ఇంటికి వచ్చేయ్’ అనే సందేశాన్ని అతడికి చేరవేసింది. ఈ నేపథ్యంలో అతడు ఎగిరి గంతేశాడు. ఆమె చెప్పిన మాటలు తూచా తప్పకుండా పాటించేందుకు.. బుర్కా వేసుకున్నాడు. అయితే కథ అడ్డం తిరిగింది. దీంతో చివరికి అతడికి ఏ గతి పట్టిందనే విషయం తెలియాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే.


ఉత్తరప్రదేశ్‌(Uttar pradesh)లోని షార్జహాన్‌పూర్‌(Shahjahanpur)కు చెందిన సైఫ్ అలీ అనే యువకుడికి ప్రస్తుతం 25ఏళ్లు. కొన్నేళ్లుగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు(Love). ఆమె కూడా అతడిని ఇష్టపడుతుంటంతో.. ఇద్దరూ అప్పుడప్పుడూ కలిసేవారు. ఈ క్రమంలోనే సైఫ్ అలీకి ఉద్యోగం వచ్చింది. అతడు వేరే ప్రాంతానికి వెళ్లి, కొన్ని రోజులపాటు అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రియురాలిని ఒకసారి చూసి ప్రయాణానికి సిద్ధం అవ్వాలని అతడు భావించాడు. ఎగ్యులర్‌గా కలిసే ప్రాంతానికి రావాల్సిందిగా ఆమెను కోరాడు. అయితే ఆమె అందుకు నిరాకరించింది. అంతేకాకుండా ప్రియుడి బాధను అర్థం చేసుకుని.. అతడికి ఓ సలహా ఇచ్చింది.



ఎవ్వరు గుర్తు పట్టకుండా బుర్కా ధరించి తన ఇంటికి రావాల్సిందిగా సూచించింది. దీంతో సైఫ్ అలీ ఎగిరి గంతేశాడు. యువతి చెప్పినట్టే.. బుర్కా ధరించి(wear Burqa) ఆమె ఇంటి పరిసర ప్రాంతాలకు చేరుకున్నాడు. అయితే.. అతడి కదలికలను చూసి అనుమానం వ్యక్తం చేసిన స్థానికులు.. బుర్కా తీయాల్సిందిగా ఒత్తిడి చేశారు. చేసేదేమీ లేక అతడు తన బుర్కా తీసేశాడు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాకయ్యారు. అంతేకాకుండా పోలీసుల(Police)కు సమాచారం అందించారు. ఈ క్రమంలో అక్కడకు చేరుకున్న అధికారులు.. శాంతికి భంగం కలిగించిన నేరం కింద అతడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. దీంతో ఈ వార్త స్థానికంగా(Viral News) చర్చనీయాంశం అయింది. 


Updated Date - 2022-08-19T14:11:30+05:30 IST