‘నాకోక గాళ్‌ఫ్రెండ్ కావాలి’ అంటూ బైక్‌పై యువకుడి విన్యాసాలు.. అది చూసి పోలీసుల స్పెషల్ రివార్డ్..!

ABN , First Publish Date - 2021-12-12T19:16:50+05:30 IST

సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ యువకుడికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. హెల్మెట్ లేకుండా బైక్‌పై అతడు చేసిన విన్యాసాలు పోలీసుల దృష్టికి చేరింది. దీంతో అధికారులు అతడికి స్పెషల్ రివార్డు ప్రకటించారు. ఇంతకూ అతడు ఎవరు.. పోలీసులు

‘నాకోక గాళ్‌ఫ్రెండ్ కావాలి’ అంటూ బైక్‌పై యువకుడి విన్యాసాలు.. అది చూసి పోలీసుల స్పెషల్ రివార్డ్..!

ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ యువకుడికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. హెల్మెట్ లేకుండా బైక్‌పై అతడు చేసిన విన్యాసాలు పోలీసుల దృష్టికి చేరింది. దీంతో అధికారులు అతడికి స్పెషల్ రివార్డు ప్రకటించారు. ఇంతకూ అతడు ఎవరు.. పోలీసులు ప్రకటించిన ఆ స్పెషల్ రివార్డ్ ఏంటి అనే వివరాల్లోకి వెళితే..



సోషల్ మీడియాలో పాపులర్ కావడం కోసం కొందరు రిస్క్ చేసి మరీ వీడియోలను రికార్డు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే యూపీకి చెందిన ఓ యువకుడు.. బైక్‌ను హెల్మెట్ లేకుండా నడుపుతూ.. ‘నాకోక గాళ్‌ఫ్రెండ్ కావాలి’ (ఏక్ లడ్కీ చాయియే) అనే పాటకు ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ విన్యాసాలు చేశాడు. అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతే.. అదికాస్తా పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో స్పందించిన అధికారులు.. స్పెషల్ రివార్డుగా అతడికి జరిమానా విధించారు. అంతేకాకుండా ఫైన్ కట్టినట్టు ఆ యువకుడితో.. మరో వీడియో షూట్ చేయించి, రెండు వీడియోలను కలిపి ‘బైక్‌పై ప్రయాణిస్తున్నపుడు.. ఎట్టిపరిస్థితుల్లోనూ రీల్స్ చేయకండి’ అని సూచిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. 






Updated Date - 2021-12-12T19:16:50+05:30 IST