మంటల్లో గ్యాస్ సిలిండర్.. చిన్న ఉపాయంతో తప్పిన ప్రమాదం..!

ABN , First Publish Date - 2020-07-30T17:37:38+05:30 IST

ప్రస్తుతం నెటిజన్లు ఉత్తరప్రదేశ్ కానిస్టేబుల్ యోగేంద్ర రాఠీని పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు.

మంటల్లో గ్యాస్ సిలిండర్.. చిన్న ఉపాయంతో తప్పిన ప్రమాదం..!

లక్నో: ప్రస్తుతం నెటిజన్లు ఉత్తరప్రదేశ్ కానిస్టేబుల్ యోగేంద్ర రాఠీని పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. కారణం.. ఆయన ధైర్య సాహసాలు, సమయస్ఫూర్తి. గ్యాస్ సిలిండర్‌కు మంట అంటుకుని గుడిసె మొత్తం తగలబడిపోతుందనగా.. ఆయన రంగంలోకి దిగి అత్యంత చాకచక్యంతో పెను ప్రమాదాన్ని నివారించారు. ఇందుకు సంబంధించి వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. పోలీసు అధికారి రాహుల్ శ్రీవాత్సవ దీన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు.


గ్యాస్ సిలిండర్‌కు మంట అంటుకోవడంతో యోగేంద్ర రాఠీ వెంటనే నిళ్లలో తడిపిన రగ్గును సిలిండర్‌పై నేర్పుగా కప్పారు. దీంతో మంటలు ఒక్క క్షణంలో ఆరిపోయాయి. పెను ప్రమాదం తప్పింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది చూస్తే గుండె ఆగినంతపనైందని కొందరు నెటిజన్లు అంటే..రోమాలు నిక్కపొడుకున్నాయని కొందరు వ్యాఖ్యానించారు. ఇంతటి ప్రామదకర పరిస్థితిలోనూ ఏమాత్రం తొణకని యేగేంద్ర రాఠీ తీరుకు వారందరూ ముగ్థులవుతున్నారు. వీడియో చూస్తే..మీకూ అలా అనిపించడం పక్కా..!



Updated Date - 2020-07-30T17:37:38+05:30 IST