రెచ్చిపోయిన ఎస్సై : పోలీసు వాహనంతో కూరగాయల కుప్పలపై దూసుకొచ్చి...

ABN , First Publish Date - 2020-06-06T15:09:20+05:30 IST

పోలీసు జీపుతో కూరగాయల కుప్పలను ధ్వంసం చేసిన ఉత్తరప్రదేవ్ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌పై అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

రెచ్చిపోయిన ఎస్సై : పోలీసు వాహనంతో కూరగాయల కుప్పలపై దూసుకొచ్చి...

ప్రయాగ్‌రాజ్: పోలీసు వాహనంతో కూరగాయల కుప్పలను ధ్వంసం చేసిన ఉత్తరప్రదేవ్ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌పై అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రస్తుతానికి అతడిని సస్పెండ్ చేయడమే కాకుండా.. స్థానం చెలనం కూడా కల్పించింది. ప్రయాగ్‌రాజ్‌లోని ఓ మార్కెట్లో జరిగిన ఈ ఘటన తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఈ ఘటన  వెలుగులోకొచ్చింది. ఘూర్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది.


వీడియోలోని దృశ్యాల ప్రకారం.. తొలుత ఓ పోలీస్ వాహనం సైరెన్ ధ్వనుల మధ్య వేగంగా మార్కెట్లోకి దూసుకువచ్చింది. ఇది గమనించిన వారికి ఏం జరుగుతోందో అర్థంకాక చెల్లాచెదురుగా పరిగెత్తారు. ఆ తరువాత వాహనం.. మార్కెట్లో కుప్పలుగా పోసి ఉన్న కూరగాయలపై దూసుకెళ్లి వాటిని నాశనం చేసింది. అనంతరం.. సదరు పోలీసు.. వాహాన్నాన్ని రివర్స్ చేసి మిగలిపోయిన కూరగాయలను కూడా ధ్వంసం చేశాడు.


అయితే అతడిని ఈ చర్యకు పురికొల్పిందేమిటనేదానిపై స్పష్టత లేకపోయినప్పటికీ.. మార్కెట్లోని ప్రజలు, వ్యాపారులు భౌతిర దూరం పాటించకపోవడంతో సదరు ఎస్సై తన సహనాన్ని కోల్పోయి ఈ దుశ్చర్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. పోలీసు శాఖ ఉన్నతాధికారులు ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుని ఎస్సైని సస్పెండ్ చేశారు.


‘ఇదో హేయమైన చర్య..’ అని ప్రయాగ్‌రాజ్ పోలీస్ బాస్ సత్యార్థ్ అనిరుథ్ పంకజ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. కాగా..గతనెలలో మీరట్ జిల్లాలో ఇదే తరహా ఘటన ఒకటి చోటుచేసుకుంది. స్థానిక పోలీసులు కూరగాయల బళ్లను తల్లకిందులు చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.

Updated Date - 2020-06-06T15:09:20+05:30 IST