యూపీ సీఎంవో ట్విటర్‌ ఖాతా హ్యాక్‌!

ABN , First Publish Date - 2022-04-10T08:27:20+05:30 IST

యూపీ సీఎం కార్యాలయ అధికారిక ట్విటర్‌ ఖాతా హ్యాక్‌ అయింది. శుక్రవారం అర్ధరాత్రి హ్యాక్‌ చేసిన దుండగులు వరుస ట్వీట్లతో హోరెత్తించారు.

యూపీ సీఎంవో ట్విటర్‌ ఖాతా హ్యాక్‌!

లఖ్‌నవూ, ఏప్రిల్‌ 9: యూపీ సీఎం కార్యాలయ అధికారిక ట్విటర్‌ ఖాతా హ్యాక్‌ అయింది. శుక్రవారం అర్ధరాత్రి హ్యాక్‌ చేసిన దుండగులు వరుస ట్వీట్లతో హోరెత్తించారు. కొన్ని ప్రభుత్వ ట్వీట్లను తొలగించారు. అప్రమత్తమైన అధికారులు ట్విటర్‌ అకౌంట్‌ను నిలిపివేశారు. హ్యాకింగ్‌ వెనుక అసాంఘిక శక్తుల హస్తం ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు.

Updated Date - 2022-04-10T08:27:20+05:30 IST