Abn logo
Aug 4 2021 @ 10:55AM

అఖిలేష్ సైకిల్ యాత్రపై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు!

లక్నో: సమాజ్‌వాదీపార్టీ అధ్యక్షుడు(ఎస్పీ) అఖిలేష్ యాదవ్ చేపట్టబోతున్న సైకిల్ యాత్రపై ఉత్తరప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు స్వతంత్రదేవ్ సింగ్ పలు విమర్శలు చేశారు. సమాజ్‌వాదీ పార్టీ నేతలు సైకిల్ యాత్రలు చేపట్టినా, పాదయాత్రలు చేపట్టినా ప్రజలకు అటువంటి నేతల లొసుగులు వ్యవహారాలన్నీ స్పష్టంగా తెలుసని వ్యాఖ్యానించారు. ఆ నేతల గూండాగిరి, అవినీతి వ్యవహారాలు, వారసత్వ రాజకీయాలు అందరికీ తెలిసినవేని అన్నారు. దీనికితోడు ఇటీవల జరిగిన అన్ని ఎన్నికల్లోనూ సమాజ్‌వాదీ పార్టీ ఘోరంగా విఫలం చెందిందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం ఆదిత్యనాథ్‌ల సారధ్యంలో రాష్ట్రం అభివృద్ధిపథంలో నడుస్తున్నదన్నారు. అన్నివర్గాల సంక్షేమానికి బీజేపీ ప్రభుత్వం పాటుపడుతున్నదన్నారు.