ఐఫోన్‌లో యూనివర్సల్‌ సెర్చ్‌

ABN , First Publish Date - 2022-06-04T08:51:42+05:30 IST

యాపిల్‌ తన ఉత్పత్తుల్లో ముఖ్యంగా ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై ఉంచిన ఇంటిగ్రేటెడ్‌ సెర్చ్‌ ఫీచర్‌ చాలా పర్ఫెక్ట్‌గా పనిచేస్తుంది.

ఐఫోన్‌లో యూనివర్సల్‌ సెర్చ్‌

యాపిల్‌ తన ఉత్పత్తుల్లో ముఖ్యంగా ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై ఉంచిన ఇంటిగ్రేటెడ్‌ సెర్చ్‌ ఫీచర్‌ చాలా పర్ఫెక్ట్‌గా పనిచేస్తుంది. మేక్‌ఔస్‌, ఐపాడ్‌ఔస్‌ ఏదైనప్పటికీ ఈ ఫీచర్‌ చాలా బాగా పనిచేస్తుంది. ఈ టూల్‌ శక్తిమంతమైనది అయినప్పటికీ చాలా మందికి ఆ విషయం తెలియదు. యాప్స్‌, వెబ్‌సైట్స్‌ తదితరాలన్నింటి అన్వేషణలో దీని పాత్ర ప్రభావపూరితంగా ఉంటుంది. దీనిని ఉపయోగించుకునేందుకు ఐఫోన్‌ను మొదట అన్‌లాక్‌ చేయాలి. తదుపరి యాప్‌ లైబ్రరీ స్ర్కీన్‌ మొదలుకుని ఏదైనా హోమ్‌ స్ర్కీన్‌పై కేవలం మధ్య నుంచి మాత్రమే స్వైప్‌ చేయాలి. సెర్చ్‌బార్‌, కీబోర్డ్‌ ఓపెన్‌ అయితే చాలు సమస్యలను టైప్‌ చేయవచ్చు. అవసరమైన వాటిని చాలా సులువుగా సొంతం చేసుకోవచ్చు. 

Updated Date - 2022-06-04T08:51:42+05:30 IST