ఇమ్రాన్ ఖాన్‌ను నిలదీసిన అమెరికా

ABN , First Publish Date - 2022-02-24T22:21:18+05:30 IST

రష్యాలో పర్యటిస్తున్న పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్‌ను

ఇమ్రాన్ ఖాన్‌ను నిలదీసిన అమెరికా

వాషింగ్టన్ : రష్యాలో పర్యటిస్తున్న పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్‌ను అమెరికా ప్రశ్నించింది. రష్యా, ఉక్రెయిన్లపై తన వైఖరిని స్పష్టం చేయాలని నిలదీసింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో తన వైఖరిని అమెరికా ఖాన్‌కు తెలిపింది. ఉక్రెయిన్‌పై దాడికి వ్యతిరేకంగా దృఢమైన వైఖరిని ప్రదర్శిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపింది. 


పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ బుధవారం రష్యా పర్యటనకు బయల్దేరారు. ఆయన రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. దీనిపై స్పందించాలని కోరినపుడు అమెరికా  స్టేట్ డిపార్ట్‌మెంట్ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ మాట్లాడుతూ, ఖాన్ రష్యా పర్యటన గురించి తమకు తెలుసునన్నారు. పుతిన్ చర్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ గళమెత్తడం ప్రతి దేశపు బాధ్యత అని తెలిపారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడిపై తమ వైఖరిని పాకిస్థాన్‌కు తెలియజేశామన్నారు. యుద్ధం కన్నా దౌత్యం కోసం తాము చేస్తున్నకృషిని వివరించామని చెప్పారు. 


రష్యా గురువారం ఉదయం ఉక్రెయిన్‌పై దాడి చేసింది. ఇమ్రాన్ రష్యా పర్యటనకు బయల్దేరడానికి ముందే ఆ దేశంపై అనేక పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించాయి. 


Updated Date - 2022-02-24T22:21:18+05:30 IST