ఆగ్రా నగరంలో ఓటు వేసిన కేంద్రమంత్రి

ABN , First Publish Date - 2022-02-10T15:45:32+05:30 IST

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగులో భాగంగా కేంద్ర మంత్రి, బీజేపీ అభ్యర్థి ఎస్పీ సింగ్ బాఘేల్ గురువారం ఉదయం ఆగ్రా నగరంలో తన ఓటు హక్కును ...

ఆగ్రా నగరంలో ఓటు వేసిన కేంద్రమంత్రి

లక్నో : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగులో భాగంగా కేంద్ర మంత్రి, బీజేపీ అభ్యర్థి ఎస్పీ సింగ్ బాఘేల్ గురువారం ఉదయం ఆగ్రా నగరంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేంద్రమంత్రి ఎస్పీ సింగ్ బాఘేల్ సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ పై మెయిన్ పురి కర్హాల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. గురువారం ఉదయం 9 గంటల వరకు 58 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుమారు 8 శాతం ఓట్లు పోలయ్యాయి.ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గత ఐదేళ్లలో అభివృద్ధికి బాటలు వేసిన బీజేపీకి ఓటేయాలని మధుర అసెంబ్లీ బీజేపీ అభ్యర్థి శ్రీకాంత్ శర్మ కోరారు. ఈ ఎన్నికలు సాధారణమైనవి కావని, వీటితో అభివృద్ధి, మహిళల భద్రత ముడిపడి ఉందని శర్మ చెప్పారు. ప్రతి ఓటు యూపీలో అల్లర్లను నివారిస్తుందని సీఎం యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు.


Updated Date - 2022-02-10T15:45:32+05:30 IST