Advertisement
Advertisement
Abn logo
Advertisement

కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ను పరిశీలించిన కేంద్రమంత్రి

తిరుపతి సిటీ, అక్టోబరు 22: తిరుపతి మున్సిపల్‌ పరిధిలోని ఎంసీహెచ్‌ సెంటర్‌ ఆరోగ్య కేంద్రంలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ను కేంద్ర మంత్రి డాక్టర్‌ మురుగన్‌ శుక్రవారం పరిశీలించారు. వ్యాక్సిన్‌ ప్రక్రియను పక్కాగా అమలు చేస్తున్నారంటూ అభినందించారు. డాక్టర్‌ ప్రియాంక, హెల్త్‌ సూపర్‌వైజర్‌ రత్నకుమారి, ఏఎన్‌ఎంలు ఇందిర, శిరీష, సిబ్బంది లక్ష్మి, అరుణ, సుబ్బలక్ష్మి, తులసి, పద్మ, సూపర్‌వైజర్‌ శివరాజు, ఎల్‌.టి.జగదీష్‌, వెంకటరాజును ఆయన సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేత భానుప్రకా్‌షరెడ్డి, తిరుపతి పార్లమెంటు పార్టీ అధ్యక్షుడు సన్నారెడ్డి దయాకర్‌ రెడ్డి, నేతలు పొన్నగంటి భాస్కర్‌, మునిసుబ్రహ్మణ్యం, వరప్రసాద్‌, విశ్వనాథ్‌ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని శుక్రవారం ఉదయం కేంద్ర మంత్రి మురుగన్‌ దర్శించుకున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేస్తూనే వ్యాక్సినేషన్‌ తయారీలో మోదీ సమర్థంగా వ్యవహరించి భారత్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చారన్నారు. 

Advertisement
Advertisement