కేంద్ర ఆర్థికశాఖ మంత్రి రేపు రాక

ABN , First Publish Date - 2021-08-06T05:26:10+05:30 IST

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ శనివారం జిల్లాకు రానున్నారు. ఆమె పర్యటనకు సంబంధించి షెడ్యూల్‌ ఖరారైంది. 7న ఉదయం 10 గంటలకు ఆమె పొందూరు చేరుకుంటారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్బంగా పొందూరులోని ఆంధ్రా ఫైన్‌ఖాదీ కార్మిక సంఘం(ఎఎఫ్‌ఎఫ్‌కే)లో ఉదయం 10నుంచి మధ్యాహ్నం 2.15 గంటల వరకు నిర్వహించనున్న కార్యక్రమంలో పాల్గొంటారు.

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి రేపు రాక
మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌

- నిర్మలాసీతారామన్‌ పర్యటన షెడ్యూలు ఖరారు

గుజరాతీపేట, ఆగస్టు 5: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ శనివారం జిల్లాకు రానున్నారు. ఆమె పర్యటనకు సంబంధించి షెడ్యూల్‌ ఖరారైంది. 7న ఉదయం 10 గంటలకు ఆమె పొందూరు చేరుకుంటారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్బంగా పొందూరులోని ఆంధ్రా ఫైన్‌ఖాదీ కార్మిక సంఘం(ఎఎఫ్‌ఎఫ్‌కే)లో ఉదయం 10నుంచి మధ్యాహ్నం 2.15 గంటల వరకు నిర్వహించనున్న కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్న భోజన విరామం అనంతరం 3 గంటల నుంచి 3.45 వరకు పార్టీ కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు పొందూరులో బయలుదేరి రోడ్డు మార్గం ద్వారా విశాఖకు వెళ్తారు. 


ఏర్పాట్లు పూర్తి చేయండి : కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ 

కలెక్టరేట్‌, ఆగస్టు 5: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌  జిల్లా పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ అధికారులను ఆదేశించారు. తన కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతీయ చేనేతకారుల దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్‌ శనివారం జిల్లాకు వస్తున్నట్లు చెప్పారు. ఆమె పొందూరులోని ఆంధ్రా ఫైన్‌ ఖాదీ కార్మికాభివృద్ధి సంఘం సంస్థను సందర్శిస్తారని తెలిపారు. అనంతరం వ్యవసాయ మార్కెట్‌ యార్డు ప్రాంగణంలో లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారని తెలిపారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో కొవిడ్‌ నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు. ఇదే ప్రాంగణంలో ప్రభుత్వ శాఖలు, బ్యాంకులకు సంబంధించి 50 వరకు స్టాల్స్‌ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జేసీలు సుమిత్‌కుమార్‌, కె.శ్రీనివాసులు, హిమాంశు కౌశిక్‌, ఆర్‌.శ్రీరాములునాయుడు, డీఆర్వో బి.దయానిధి, ఆర్డీవో ఐ.కిషోర్‌, డీఎస్పీ ఎం.మహేంద్ర, డ్వామా పీడీ హెచ్‌ కూర్మారావు, జడ్పీ సీఈఓ బి.లక్ష్మీపతి, డి.ఆర్‌.డి.ఎ. పీడీ బి.శాంతిశ్రీ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-06T05:26:10+05:30 IST