సర్దార్‌ పటేల్‌ జయంతిని అధికారికంగా నిర్వహించాలి

ABN , First Publish Date - 2020-11-01T08:50:58+05:30 IST

ప్రభుత్వం మజ్లిస్‌ పార్టీకి భయపడి రాష్ట్రంలో సర్దార్‌ వల్లాభాయ్‌ పటేల్‌ జయంత్యుత్సవాలను అధికారికం గా నిర్వహించడంలేదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు

సర్దార్‌ పటేల్‌ జయంతిని అధికారికంగా నిర్వహించాలి

కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి 


మంగళ్‌హాట్‌, అక్టోబర్‌ 31(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం మజ్లిస్‌ పార్టీకి భయపడి రాష్ట్రంలో సర్దార్‌ వల్లాభాయ్‌ పటేల్‌ జయంత్యుత్సవాలను అధికారికం గా నిర్వహించడంలేదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం తెలంగాణ విమోచన దినాన్ని జరిపేందుకు కూడా ముందుకు రాలేకపోతోందని ఆరోపించారు. శనివారం ఆయన సర్దార్‌ వల్లాభాయ్‌ పటేల్‌ జయంతిని పురస్కరించుకొని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షు డు డాక్టర్‌ లక్ష్మణ్‌, పార్టీ నాయకులతో కలిసి నాంపల్లి గన్‌పార్క్‌ ఎదురుగా ఉన్న వల్లాభాయ్‌ పటేల్‌ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. అనంతరం కిషన్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ గడ్డపై భారతదేశ జెండాను ఎగురవేయించిన పటేల్‌ జయంతిని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించలేని దుస్థితిలో ఉందన్నారు. అనంతరం డాక్టర్‌ లక్ష్మణ్‌ మాట్లాడుతూ సర్దార్‌ పటేల్‌ జయంతిని పురస్కరించుకొని ఉత్సవాలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌రెడ్డితోపాటు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.   


పటేల్‌ ఆశయాలు స్ఫూర్తిదాయకం 

బంజారాహిల్స్‌: సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ ఆశయాలు స్ఫూర్తిదాయమ ని బీజేపీ జూబ్లీహిల్స్‌ డివిజన్‌ నాయకుడు పల్లపు గోవర్ధన్‌ అన్నారు. పటేల్‌ జయంతిని పురస్కరించుకుని శనివారం ఆయన విగ్రహానికి పూల వేసి నివాళులర్పించారు. అనంతరం గోవర్ధన్‌ మాట్లాడారు.  


సనత్‌నగర్: సనత్‌నగర్‌ పబ్లిక్‌ గార్డెన్‌ ఎదురుగా ఉన్న సర్దార్‌ వల్లాభాయ్‌ పటేల్‌ విగ్రహానికి బీజేపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో దయానంద్‌, శ్రీనివా్‌సగౌడ్‌, క్రాంతి, చందు, భాస్కర్‌, నరేష్‌, మచ్చర్ల శ్రీనివాస్‌ యాదవ్‌, వై. శ్రీనివాస్‌ రావు తదితరులు పాల్గొన్నారు.


యూసు్‌ఫగూడ:  వల్లాభాయ్‌ పటేల్‌ జయంతిని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఏక్తాదివస్‌ సందర్భంగా యూసు్‌ఫగూడ ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్‌ నరసిం హ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు జాతీయ సమైక్యత ప్రతిజ్ఞ నిర్వహించారు. 


ఎస్పీ కాలేజీలో..

పద్మారావునగర్‌: సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతిని పద్మారావునగర్‌లోని ఎస్పీ డిగ్రీ, పీజీ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో ఉన్న సర్దార్‌ వల్లభాయ్‌పటేల్‌ విగ్రహానికి పూలమాలలువేసి  నివాళులు అర్పించారు. అనంతరం భారత ఐక్యత ది వాస్‌ ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో కళాశాల సొసైటీ సెక్రటరీ బి.సురేందర్‌రెడ్డి, ప్రిన్సిపాల్‌ డా. కె.నర్మదారెడ్డి, విద్యాజ్యోతి ఎన్‌ఎ్‌సఎస్‌ ఇన్‌చార్జి శ్యాంసుందర్‌, రమేష్‌, అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-01T08:50:58+05:30 IST