అఫ్ఘాన్ సంక్షోభం: 40 లక్షల చిన్నారులు స్కూలుకు దూరం... 10 లక్షల పిల్లలకు పోషకాహార లోపం!

ABN , First Publish Date - 2021-08-30T15:50:22+05:30 IST

అఫ్ఘానిస్తాన్ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయాక...

అఫ్ఘాన్ సంక్షోభం: 40 లక్షల చిన్నారులు స్కూలుకు దూరం... 10 లక్షల పిల్లలకు పోషకాహార లోపం!

కాబుల్: అఫ్ఘానిస్తాన్ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయాక ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా మహిళలు, చిన్నారుల జీవితాలు దుర్భరంగా మారిపోయాయి. అఫ్ఘానిస్తాన్ లో నెలకొన్న పరిస్థితుల గురించి యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్(యూనిసెఫ్) దక్షిణాసియా ప్రాంతీయ డైరెక్టర్ జార్జ్ లారియా అడ్జేయ్ మాట్లాడుతూ గడచిన వారంలో అఫ్ఘానిస్తాన్ లో చోటుచేసుకున్న పరిణామాలు చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపాయి. కొంతమంది చిన్నారులు తమ ఇళ్లను, స్కూళ్లను, స్నేహితులను కోల్పోయారు. శారీరక, మానసిక అనారోగ్యానికి గురయ్యారు. ఇదేపరిస్థితి కొనసాగితే రాబోయే ఐదేళ్లలో 10 లక్షలమంది చిన్నారులు పోషకాహార లోపానికి గురయ్యే ప్రమాదముందని అన్నారు. ప్రస్తుతం 40 లక్షలమంది చిన్నారులు స్కూలుకు దూరమయ్యారని తెలిపారు. అఫ్ఘానిస్తాన్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు చిన్నారుల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2021-08-30T15:50:22+05:30 IST