Advertisement
Advertisement
Abn logo
Advertisement

మంత్రిపై నిరాధార ఆరోపణలు మానుకోవాలి

వెల్గటూర్‌, నవంబరు 28: నియోజకవర్గ అభివృద్ధికి అలుపెరగని కృషి చేస్తున్న మంత్రి కొప్పుల ఈశ్వర్‌పై డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ నిరాధార ఆరోపణలు చేయడం మానుకోవాలని టీఆర్‌ ఎస్‌ నాయకులు హెచ్చరించారు. టీఆర్‌ఎస్‌ మండలశాఖ అధ్యక్ష, కార్య దర్శులు సింహాచలం జగన్‌, జూపాక కుమార్‌ మాట్లాడుతూ వరి ధా న్యం కొనుగోలు విషయంలో రాజకీయం చేయడం కాంగ్రెస్‌ నాయకుల కే చెల్లిందన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణం, 24 గంట ఉచిత విద్యుత్‌ ఇవ్వడం వలననే లక్ష ముప్పై తొమ్మిది వేల ఎకరాలు సాగు లోకి వచ్చి వరి ధాన్యం అధికంగా పండుతోందన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై గానీ, మంత్రి కొప్పుల ఈశ్వర్‌పై గానీ కడుపుమంటతో నిరాధార ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. కాం గ్రెస్‌ ప్రభుత్వ హయాంలో రైతులకు ఎలాంటి లబ్ది చేకూరిందో తెలుసు కోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్‌ అధ్యక్షులు గూడ రాంరెడ్డి, రత్నాకర్‌, మాజీ ఏఎంసీ చైర్మన్‌ కృష్ణారెడ్డి, రామస్వామి, రాంచం ద్రం గౌడ్‌, తిరుపతి, జగదీశ్వర్‌, నర్సయ్య, రాజేశం, అశోక్‌, రాజయ్య, సురేష్‌, మల్లేశం పాల్గొన్నారు.


Advertisement
Advertisement