Abn logo
Aug 4 2021 @ 00:14AM

పోస్టుల భర్తీ లేకనే నిరుద్యోగుల ఆత్మహత్యలు

భువనగిరిలో ధర్నా చేస్తున్న కాంగ్రెస్‌, అనుబంధ సంఘాల కార్యకర్తలు

భువనగిరి టౌన్‌/వలిగొండ, ఆగస్టు 3: ప్రభుత్వశాఖల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయకపోవడం వల్లే నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని కాంగ్రెస్‌ భువనగిరి మునిసిపల్‌ ఫ్లోర్‌లీడర్‌ పోత్నక్‌ ప్రమోద్‌కుమార్‌, మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ బర్రె జహంగీర్‌ అన్నారు. నిరుద్యోగుల ఆత్మహత్యలను ఖండిస్తూ మంగళవారం భువనగిరిలో కాంగ్రెస్‌ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మకు అంతిమయాత్ర నిర్వహించి దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉన్నత చదువులు చదువుకున్నప్పటికీ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ చేపట్టకపోతుండటంతో నిరాశతో నిరుద్యోగులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారన్నారు. ఇవన్నీ ప్రభుత్వ హత్యలే అన్నారు. కార్యక్రమంలో ఎండీ బబ్లు, దర్గాయి హరిప్రసాద్‌, బర్రె నరేష్‌, మంగ ప్రవీణ్‌, ఎండీ షరీఫ్‌, ఎండీ రఫీయొద్దీన్‌, కాకునూరి మహేందర్‌, వడిచెర్ల కృష్ణ, కె.సోమయ్య, దకూరి ప్రకాష్‌ పాల్గొన్నారు. అదే విధంగా దళితబంధు పథకం అన్ని నియోజకవర్గాల్లో అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ వలిగొండలో సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడు తూ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి రాజీనామాచేస్తే నియోజకవర్గానికి నిధులు వచ్చే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ నూతి రమే్‌షరాజు, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు పాశం సత్తిరెడ్డి, నాయకులు బోళ్ల శ్రీనివాస్‌, వాకిటి అనంతరెడ్డి, బాలనర్సింహ, జానకిరాములు, రాజు, స్వామి తదితరులు పాల్గొన్నారు.