ఉడకని అన్నం.. నీళ్ల చారు

ABN , First Publish Date - 2021-10-19T04:52:20+05:30 IST

మహబూబ్‌నగర్‌ జిల్లాలోని చాలా ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం మెనూ అమలు కావడం లేదు. భోజనంలో నాణ్యత పాటించడం లేదు.

ఉడకని అన్నం.. నీళ్ల చారు
మహ్మదాబాద్‌ జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వడ్డిస్తున్న మధ్యాహ్న భోజనం

మధ్యాహ్న భోజనంలో పాటించని మెను

మహబూబ్‌నగర్‌ జిల్లాలోని చాలా పాఠశాలల్లో ఇదే పరిస్థితి

విద్యార్థుల సంఖ్య ఎక్కువ ఉన్న చోట మరింత దారుణం

అందని గుడ్లు

ఊసేలేని వెజిటబుల్‌ బిర్యానీ


మహబూబ్‌నగర్‌ జిల్లాలోని చాలా ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం మెనూ అమలు కావడం లేదు. భోజనంలో నాణ్యత పాటించడం లేదు. ఉడికీ ఉడకని అన్నం, నీళ్ల చారు వడ్డిస్తున్నారని విద్యార్థులు వాపోతున్నారు. వారంలో మూడు రోజులు గుడ్డు ఇవ్వాల్సి ఉండగా ఇవ్వడంలేదని చెబుతున్నారు. పర్యవేక్షణ కొరవడటం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని తెలుస్తోంది.

- మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం

 

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో సన్న బి య్యం అన్నంతో పాటు వారం లో మూడు రోజులు గు డ్డు, కూరగాయలు, పప్పు, సాం బరు అందించాలని ప్రభు త్వం ఆదేశించింది. కానీ ఆ మెనూ మహబూ బ్‌నగర్‌ జిల్లాలో అమలవడం లే దు. జిల్లా వ్యాప్తంగా 836 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నా యి. వాటిలో సమారు 85 వేల మంది విద్యార్థులు చదువుకుం టున్నారు. వారిలో 80 శాతం మంది విద్యార్థులు పాఠశాలల్లో మధ్యా హ్న భోజనం చేస్తున్నారు. మెనూ సరిగా అమలవడం లేదని, నాణ్యత లేని భోజనం పెడుతున్నారని విద్యార్థులు చెబుతు న్నారు. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న పాఠశాలల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉందని అంటున్నారు. అక్షయ పాత్ర ద్వారా భోజనం అందిస్తున్న చోట బాగుంటున్నా, ఏజెన్సీల ద్వారా భోజనం అందిస్తున్న చోట్ల నాణ్యత పాటించడం లేదనే విమర్శలొస్తున్నాయి. మహ్మ దాబాద్‌ మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో సర్పంచు పేరు మీదే మధాహ్న భోజన ఏజెన్సీ కొనసాగుతోందని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకట్‌రెడ్డి చెబుతున్నారు.


పర్యవేక్షణ లేకపోవడం వల్లే

విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం మధ్యాహ్న భోజనానికి పెద్ద ఎత్తున నిధులను ఖర్చు చేస్తోంది. కానీ పర్యవేక్షణ లేకపోవడం వల్ల లక్ష్యం నెరవేరడం లేదు. మండల విద్యాశాఖ అధికారుల పోస్టులు ఖాళీగా ఉండటం, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు రెండు మూడు మండలాలకు ఇన్‌చార్జి ఎంఈవోలుగా ఉండటం, జిల్లా స్థాయి అధికారులు కూడా వివిధ కారణాల వల్ల పూర్తి స్థాయిలో పర్యవేక్షించకపోవడం తదితర కారణాల వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. గుడ్లు సరిగా ఇవ్వడం లేదని, అన్నం, నీళ్ల చారు వడ్డిస్తున్నారని తెలుస్తోంది. శనివారం వెజిటబుల్‌ బిర్యాన్ని అందించాల్సి ఉండగా, ఎక్కడా అమలవడం లేదని సమాచారం. అధికారులు పర్యవేక్షణ చేసి, నాణ్యమైన భోజనం అందేలా చూడాలని కోరుతున్నారు.


గుడ్లు ఇవ్వడం లేదు 

కూరలు సరిగా చేయడం లేదు. అన్నం ఒక్కో రోజు బాగుండదు. ఇదేంటంటే మీ ఇంటి వద్ద కూడా ఒక రోజు చెడిపోతుంది కదా. ఒక రోజు చెడిపోతే తింటే ఏమ వుతుంది? అని అంటున్నారు. సోమవారం, బుధవారం, శుక్రవారం గుడ్డు ఇవ్వాలని బోర్డుపై రాశారు. కానీ అలా ఇవ్వడం లేదు. ఈ రోజు నీళ్ల చారు, అన్నం పెట్టారు. గుడ్డు ఇవ్వలేదు.

- బీరయ్య, పదో తరగతి, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, మహ్మదాబాద్‌


మెను పాటించాలని చెప్పాం

ప్రభుత్వ నిబంధనల ప్రకారం విద్యార్థులకు మధా హ్న భోజనంలో తప్పని సరిగా మెనూ పాటించాలని చెప్పాం. భోజనం సరిగా ఉం డటం లేదని, గుడ్లు ఇవ్వడం లేదని విద్యార్థులు చెబుతు న్నారు. ఈ విషయమై ఏజెన్సీలకు పలుమార్లు చెప్పాం. సోమవారం గుడ్డు ఇవ్వాలని ఉదయమే చెప్పాం. కానీ ఇవ్వలేదు. వంట ఏజె న్సీ సర్పంచ్‌ పేరుమీద ఉంది. వారే వంట కార్మికులతో భోజనం చేయిస్తున్నారు. 

- వెంకట్‌రెడ్డి, ప్రధానోపాధ్యాయుడు, బాలుర ఉన్నత పాఠశాల, మహమ్మదాబాద్‌



Updated Date - 2021-10-19T04:52:20+05:30 IST