Viral Video: ఈ అంకుల్ డాల్ఫిన్ డ్యాన్స్.. నభూతో నభవిష్యత్.. చూస్తే మళ్లీ మళ్లీ చూస్తారు..

ABN , First Publish Date - 2022-01-28T03:19:01+05:30 IST

కొందరు డ్యాన్స్ చేస్తుంటే అలాగే చూడాలనిపిస్తుంది. సినిమాలోని డ్యాన్స్‌లు పక్కన పెడితే.. కొందరు రియల్‌గా చేసిన డ్యాన్సు వీడియోలు ఇటీవల చాలా వైరల్ అయిన విషయం తెలిసిందే. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది...

Viral Video: ఈ అంకుల్ డాల్ఫిన్ డ్యాన్స్.. నభూతో నభవిష్యత్.. చూస్తే మళ్లీ మళ్లీ చూస్తారు..

కొందరు డ్యాన్స్ చేస్తుంటే అలాగే చూడాలనిపిస్తుంది. సినిమాలోని డ్యాన్స్‌లు పక్కన పెడితే.. కొందరు రియల్‌గా చేసిన డ్యాన్సు వీడియోలు ఇటీవల చాలా వైరల్ అయిన విషయం తెలిసిందే. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది. స్టేజి మీద ఓ యువతి, కొందరు యువకులు డ్యాన్స్ చేస్తుండగా.. మధ్యలో ఓ అంకుల్ ఎంటరవుతాడు. వారి మధ్య అతను వినూత్నంగా చేసిన డ్యాన్సు ప్రస్తుతం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.


ఈ కార్యక్రమం ఎక్కడ జరిగిందో తెలీదు గానీ.. వీడియో మాత్రం నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. స్టేజి పైన పాప్‌ సింగర్‌ సప్నా చౌదురి పాడిన మేరి జిందగి మే ఆకే మేరా దిల్‌ కా చేన్‌ చురాయా.. పాట ప్లే అవుతూ ఉంటుంది. కొందరు యువకులు, ఓ యువతి కలిసి ఆ పాటకు లయబద్ధంగా స్టెప్పులు వేస్తూ ఉంటారు. ఈలోగా మధ్యలో ఓ అంకుల్ ఎంటర్ అవుతాడు. తానేమీ తక్కువ కాదంటూ అందరూ ఆశ్చర్యపోయేలా స్టెప్పులు వేస్తాడు. యువకులు కూడా చేయలేని విధంగా పడుకుని డాల్ఫిన్ తరహాలో కదులుతూ స్టెప్పులు వేస్తాడు. ఈ స్టెప్పుకు నెజిజన్లు ఫిదా అవుతున్నారు. ఇది  డాల్ఫిన్‌ డ్యాన్స్‌.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.

పెళ్లి మండపంలోకి వరుడి ఎంట్రీ మామూలుగా లేదుగా.. విపరీతమైన మంచులో ఎలా వెళ్లాడంటే..





Updated Date - 2022-01-28T03:19:01+05:30 IST