కాట్ అభ్యర్థులకు మూడంచెల శిక్షణ.. అందిస్తున్న యూఎన్ అకాడమీ!

ABN , First Publish Date - 2020-09-02T22:39:02+05:30 IST

దేశంలోని అతిపెద్ద అభ్యాస వేదిక యూఎన్ అకాడమీ.. కాట్ అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా శిక్షణా కార్యక్రమం నిర్వహించనుంది.

కాట్ అభ్యర్థులకు మూడంచెల శిక్షణ.. అందిస్తున్న యూఎన్ అకాడమీ!

న్యూఢిల్లీ: దేశంలోని అతిపెద్ద అభ్యాస వేదిక యూఎన్ అకాడమీ.. కాట్ అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా శిక్షణా కార్యక్రమం నిర్వహించనుంది. మూడంచెల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు యూఎన్ అకాడమీ ప్రతినిధులు తెలిపారు. తొలుత ఆగస్టు 24 నుంచి అక్టోబరు 4 వరకు వారానికి ఓసారి టీ20 డెయిలీ టెస్ట్ జరుగుతుంది. అలాగే అభ్యర్థులకు కాట్ అనుభవాన్ని ఇవ్వడం కోసం ఉచితంగా ఐదు మాక్ పరీక్షలు నిర్వహిస్తారు.  ఇదే కాట్ ఛాంపియన్‌షిప్.


ఆగస్టు 28 నుంచి జరిగే ఈ ఛాంపియన్‌షిప్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఐదుగురికి కాట్ విద్యావేత్తలతో ముఖాముఖి సంభాషించే అవకాశం కల్పిస్తారు. ఇంతేకాకుండా, సెప్టెంబరు 5 నుంచి నవంబరు 22 వరకు అడ్వాన్సుడ్ వర్క్‌షాప్ నిర్వహిస్తారు. ఈ యూఎన్ అకాడమీ కాట్ వర్క్‌షాప్‌లో అభ్యర్థులకు అవసరమైన బోధన, వివరణలు అందిస్తారు. వీటిని కాట్ ప్రిపరేటరీ సర్కిల్‌లో అత్యున్నత విద్యావేత్తలు కవర్ చేస్తారు.

Updated Date - 2020-09-02T22:39:02+05:30 IST