‘మెట్టిఒలి’ ఫేమ్‌ Uma maheswari కన్నుమూత

ABN , First Publish Date - 2021-10-18T16:44:08+05:30 IST

ప్రముఖ తమిళ టీవీ సీరియల్‌ నటి ఉమామహేశ్వరి ఆదివారం ఉదయం ఆనారోగ్య కారణాల వల్ల మృతి చెందింది. ఆమె వయసు 40 సంవత్సరాలు. 15 యేళ్ళకు ముందు ప్రముఖ టీవీ ఛానెల్‌లో ప్రసారమైన మెగా సీరియల్‌

‘మెట్టిఒలి’ ఫేమ్‌ Uma maheswari కన్నుమూత

చెన్నై: ప్రముఖ తమిళ టీవీ సీరియల్‌ నటి ఉమామహేశ్వరి ఆదివారం ఉదయం ఆనారోగ్య కారణాల వల్ల మృతి చెందింది. ఆమె వయసు 40 సంవత్సరాలు. 15 యేళ్ళకు ముందు ప్రముఖ టీవీ ఛానెల్‌లో ప్రసారమైన మెగా సీరియల్‌ ‘మెట్టిఒలి’లో నటించి తమిళ ప్రేక్షకుల మదిలో సుస్థిరస్థానం సంపాదించుకుంది.  ‘ఒరు కథయిన్‌ కథై’, ‘మంజల్‌ మహిమై’ వంటి టీవీ సీరియల్స్‌లోనూ, ‘వెట్రికొడికట్టు’, ‘అల్లి అర్జునా’ తదితర తమిళ సినిమాల్లోనూ ఆమె నటించింది. ఉమామహేశ్వరి భర్త మురుగన్‌ వెటర్నరీ డాక్టర్‌గా ఉన్నారు. వివాహమైన తర్వాత ఆమె నటనకు స్వస్తి పలికింది. గత కొద్ది రోజులుగా ఆమె తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం ఉదయం మృతి చెందింది. ఉమామహేశ్వరి మృతికి పలువురు బుల్లితెర కళాకారులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు.

Updated Date - 2021-10-18T16:44:08+05:30 IST