ఆధార్‌ తరహాలో భూములకు యూఎల్‌పిన్‌

ABN , First Publish Date - 2021-11-17T08:11:17+05:30 IST

పౌరులందరికీ ఆధార్‌ తరహాలోనే దేశవ్యాప్తంగా భూములన్నింటికీ యునీక్‌ ల్యాండ్‌ పార్సెల్‌ ఐడెంటిఫికేషన్‌ నంబర్స్‌(యూఎల్‌పిన్‌) జారీ కానుంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ ఈ విషయాన్ని తెలిపారు....

ఆధార్‌ తరహాలో భూములకు యూఎల్‌పిన్‌

రాష్ట్రాల్లో ఉత్తమ భూ నిర్వహణకు అవార్డులు, ర్యాంకులు

న్యూఢిల్లీ, నవంబరు 16: పౌరులందరికీ ఆధార్‌ తరహాలోనే దేశవ్యాప్తంగా భూములన్నింటికీ యునీక్‌ ల్యాండ్‌ పార్సెల్‌ ఐడెంటిఫికేషన్‌ నంబర్స్‌(యూఎల్‌పిన్‌) జారీ కానుంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ ఈ విషయాన్ని తెలిపారు. భూ రికార్డుల ఆధునికీకరణపై జాతీయ స్థాయి వర్క్‌షా్‌పను మంత్రి మంగళవారం ప్రారంభించారు. భూమి సంవాద్‌- నేషనల్‌ వర్క్‌షాప్‌ ఆన్‌ డిజిటల్‌ ఇండియా ల్యాండ్‌ రికార్డ్‌ మోడెర్నైజేషన్‌ ప్రోగ్రామ్‌(డీఐఎల్‌ఆర్‌ఎంపీ) పేరిట ప్రారంభమైన ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాలకు చెందిన మంత్రులు, అధికారులు హాజరయ్యారు. దీంతో పాటు నేషనల్‌ జనరిక్‌ డాక్యుమెంట్‌ రిజిస్ట్రేషన్‌ సిస్టమ్‌(ఎన్‌జీడీఆర్‌ఎ్‌స) వెబ్‌సైట్‌ను కూడా గిరిరాజ్‌ ప్రారంభించారు. భూమి నిర్వహణ, భూ సముపార్జన, మౌలిక వసతుల ప్రాజెక్టుల విషయంలో రాష్ట్రాలు ఉత్తమ పద్ధతుల్ని అలవాటు చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన మంచిపనుల్ని అభినందించేందుకు, ప్రోత్సాహాన్ని అందించేందుకు భూ వనరుల శాఖ జాతీయ భూ నిర్వహణ అవార్డు-2021ను ప్రారంభించింది.

Updated Date - 2021-11-17T08:11:17+05:30 IST