కడప(క్రైం), జనవరి 27 : కడప తాలూక పోలీ్‌సస్టేషన్ ఇన్‌స్పెక్టర్‌గా ఉలసయ్య గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన 1996 బ్యాచ్‌కు చెందిన వారు ఎస్‌ఐగా కర్నూలు జిల్లాలోని పలు పోలీ్‌సస్టేషన్లలో విధులు నిర్వహించారు. 2010లో సీఐగా పదోన్నతి పొంది సిరివెల్ల, బద్వేలు, రాజంపేట, ఒంటిమిట్ట, వాయలపాడు, కడప డీసీఆర్‌బీ, ఎర్రగుంట్లలో విధులు నిర్వహించారు. ప్రస్తుతం వీఆర్ నుండి తాలూకకు బదిలీ పై వచ్చి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పై ప్రత్యేక దృష్టిసారించి ప్రజలకు అందుబాటులో ఉంటామన్నారు. మట్కా, జూదం, వ్యబిచారం లాంటి అసాంఘీక కార్యకలాపాల పై ప్రత్యేత దృష్టిసారించి, రౌడీ షీటర్లు, ట్రబుమాంగర్స్ పై నిఘా ఉంచుతామన్నారు.