ఉక్రెయిన్‌లోని భారత ఎంబసీ కీలక ప్రకటన

ABN , First Publish Date - 2022-02-25T19:12:50+05:30 IST

ఉక్రెయిన్- రష్యా మధ్య యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్‌లోని భారత ఎంబసీ కీలక ప్రకటన చేసింది.

ఉక్రెయిన్‌లోని భారత ఎంబసీ కీలక ప్రకటన

ఉక్రెయిన్: ఉక్రెయిన్- రష్యా మధ్య యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్‌లోని భారత ఎంబసీ కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్‌‌లోని భారత విద్యార్థులు తమ వాహనాలపై భారతీయ జెండాను పెట్టుకోవాలని సూచించింది. హంగేరి బోర్డర్‌ చెక్‌పోస్టుకు చేరుకోవాలని ఎంబసీ సూచనలు చేసింది. 


కాగా... ఉక్రెయిన్‌లో అనేకమంది భారతీయులు చిక్కుకున్నారు. వారిని స్వదేశానికి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే అనేక మందిని భారత ప్రభుత్వం స్వదేశానికి తీసుకువచ్చింది. తాజాగా ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు రెండు విమానాలను సిద్ధం చేసింది. శుక్రవారం-శనివారం రాత్రి 2 గంటలకు రెండు విమానాలను భారత్‌ సర్కార్ పంపించనుంది. బుకారెస్ట్ మీదుగా భారతీయ పౌరులను ఉక్రెయిన్ నుంచి తీసుకొచ్చేందుకు రెండు ఎయిరిండియా విమానాలు బయల్దేరుతాయి. ఇండియన్ ఇవాక్యుయేషన్ టీమ్స్ రుమేనియా సరిహద్దులకు చేరుకున్నాయి. ఇక్కడి నుంచి ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు ప్రయాణించడానికి 12 గంటల సమయం పట్టనుంది. 

Updated Date - 2022-02-25T19:12:50+05:30 IST