రష్యన్ సేనలను తరిమికొట్టి ఖార్కివ్‌ను తిరిగి సొంతం చేసుకున్న ఉక్రెయిన్

ABN , First Publish Date - 2022-02-27T23:45:20+05:30 IST

రష్యన్ సేనల దాడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఉక్రెయిన్ కీలక ప్రకటన చేసింది. తమ వద్ద ఉన్న కాస్తోకూస్తో

రష్యన్ సేనలను తరిమికొట్టి ఖార్కివ్‌ను తిరిగి సొంతం చేసుకున్న ఉక్రెయిన్

కీవ్: రష్యన్ సేనల దాడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఉక్రెయిన్ కీలక ప్రకటన చేసింది. తమ వద్ద ఉన్న కాస్తోకూస్తో ఆయుధ సంపత్తితో రష్యన్ దళాలతో దీటుగా పోరాడుతున్న ఉక్రెయిన్ ఆర్మీ ఖార్కివ్ నగరాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంది. ఖార్కివ్‌ను ఆక్రమించుకున్న రష్యన్ సేనలను తమ దళాలు తరిమికొట్టాయని, నగరం తిరిగి తమ అధీనంలోకి వచ్చిందని గవర్నర్ తెలిపారు.


మరోవైపు, ఉక్రెయిన్‌పై దాడిని కొనసాగిస్తూనే తాము చర్చలకు సిద్ధమంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. బెలారస్‌లో చర్చలకు ఓకే అన్నారు. స్పందించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తాము కూడా చర్చలకు సిద్ధమేనని, అయితే బెలారస్‌లో మాత్రం కాదని అన్నారు. వార్సా, బ్రటిస్లావా, బుడాపెస్ట్, ఇస్తాంబుల్, బాకులలో ఎక్కడైనా తాము చర్చలకు సిద్ధమని ప్రకటించారు. 


యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో ఇప్పటి వరకు 200 మంది పౌరులు మరణించారు. 1.50 లక్షల మందికిపైగా పోలండ్, మల్దోవా వంటి నగరాలకు పారిపోయారు. తమ దేశాన్ని కాపాడుకునేందుకు తుదికంటా పోరాడతామని జెలెన్‌స్కీ తేల్చి చెప్పారు. ఉక్రెయిన్‌ను విడిచిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. 

Updated Date - 2022-02-27T23:45:20+05:30 IST