రష్యా చర్య.. బ్రిక్స్ తీర్మానానికి విరుద్ధం

ABN , First Publish Date - 2022-02-25T20:49:37+05:30 IST

ఉక్రెయిన్‌పై రష్యా దాడికి వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అమెరికా నేతృత్వంలోని దేశాలు చాప్టర్ 7 తీర్మానాన్ని ప్రతిపాదించాయి. అయితే, ఈ అంశానికి సంబంధించి భారత్ ఎటువైపు మొగ్గుచూపుతుందనేది ఆసక్తికరంగా మారింది.

రష్యా చర్య.. బ్రిక్స్ తీర్మానానికి విరుద్ధం

ఉక్రెయిన్‌పై రష్యా దాడికి వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అమెరికా నేతృత్వంలోని దేశాలు చాప్టర్ 7 తీర్మానాన్ని ప్రతిపాదించాయి. అయితే, ఈ అంశానికి సంబంధించి భారత్ ఎటువైపు మొగ్గుచూపుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేయడం గత ఏడాది న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ దేశాల (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా) తీర్మానానికి వ్యతిరేకం అనే అంశం తెరమీదికొచ్చింది. గత సెప్టెంబర్‌లో, న్యూఢిల్లీలో జరిగిన సదస్సులో బ్రిక్స్ దేశాలు ఒక తీర్మానం చేశాయి. దీని ప్రకారం.. దేశాలు ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ నిబంధనలను పాటించాలి. దేశాల మధ్య విబేధాలు, సమస్యల్ని శాంతియుత చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలి. దేశాలకు వ్యతిరేకంగా సైనిక చర్య తీసుకోవడంగాని, రాజకీయ ఒత్తిళ్లు చేయడంగాని కుదరదు. అలాగే దేశాల అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోరాదు. ఈ నిబంధనలపై బ్రిక్స్ సదస్సులో రష్యా సంతకం కూడా చేసింది. 


అయితే, ఇప్పుడు ఉక్రెయిన్‌పై చర్య ద్వారా రష్యా ఆ ఒప్పందాన్ని అతిక్రమించింది. ఈ నేపథ్యంలో భారత్, రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేస్తుందా? లేదా? అన్నది చూడాలి. అయితే, కాశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పుడు, 2019లో ఐరాస భద్రతా మండలిలో చైనా ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఈ విషయంలో ఉక్రెయిన్.. భారత్ నిర్ణయానికి వ్యతిరేకంగా, పాక్ పక్షాన నిలబడటం విశేషం. 

Updated Date - 2022-02-25T20:49:37+05:30 IST