యుద్ధంలో 11,000 మంది రష్యన్ సైనికుల మృతి : ఉక్రెయిన్

ABN , First Publish Date - 2022-03-06T19:27:16+05:30 IST

ఫిబ్రవరి 24న ప్రారంభమైన యుద్ధంలో 11,000

యుద్ధంలో 11,000 మంది రష్యన్ సైనికుల మృతి : ఉక్రెయిన్

కీవ్ : ఫిబ్రవరి 24న ప్రారంభమైన యుద్ధంలో 11,000 మందికి పైగా రష్యన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారని ఉక్రెయిన్ సైన్యం ఆదివారం ప్రకటించింది. నల్ల సముద్రం సమీపంలోని మైకోలైవ్ నగరం సమీపంలో భీకర పోరాటం జరుగుతోందని తెలిపింది. నౌకాశ్రయ నగరం మరియుపోల్‌లో శనివారం కాసేపు కాల్పుల విరమణ తర్వాత పెద్ద ఎత్తున బాంబు దాడులు జరిగినట్లు తెలిపింది. 


ఉక్రెయిన్‌లోని ప్రధాన నగరాల్లో చిక్కుకున్నవారిని తరలించేందుకు మానవతావాద కారిడార్లను అనుమతించాలని ప్రపంచవ్యాప్తంగా డిమాండ్లు వస్తున్నాయి. సాధారణ ప్రజలపై దాడులు జరుగుతున్నాయనే ఆరోపణలను రష్యా ఖండిస్తోంది. అయినప్పటికీ వేలాది మంది ప్రజలు ప్రధాన నగరాలను వదిలిపెట్టి పారిపోతున్నారు. ఇప్పటి వరకు దాదాపు 1.5 మిలియన్ల మంది దేశం విడిచి వెళ్ళిపోయినట్లు అంచనా. 


నల్ల సముద్రం సమీపంలో ఉన్న మరియుపోల్ నగరంలోశనివారం కాసేపు కాల్పుల విరమణ అమలైంది. ఆ తర్వాత రష్యా దళాలు బాంబులతో విరుచుకుపడ్డాయి. ఈ నగరంలో తాగునీరు, విద్యుత్తు సదుపాయాలకు విఘాతం కలిగింది. ఈ పరిస్థితి చాలా దారుణంగా ఉందని ‘డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్’ తెలిపింది. 


Updated Date - 2022-03-06T19:27:16+05:30 IST