జస్ట్ స్మెల్‌తో జ‌న స‌మూహంలో క‌రోనాని ప‌సిగ‌ట్టొచ్చు!

ABN , First Publish Date - 2021-06-14T11:11:43+05:30 IST

జ‌న స‌మూహం అధికంగా ఉన్న ప్రాంతాల్లో...

జస్ట్ స్మెల్‌తో జ‌న స‌మూహంలో క‌రోనాని ప‌సిగ‌ట్టొచ్చు!

లండ‌న్‌: జ‌న స‌మూహం అధికంగా ఉన్న ప్రాంతాల్లో కోవిడ్‌-19 ఇన్ఫెక్ష‌న్‌ను ప‌సిగ‌ట్టేందుకు త్వ‌ర‌లోనే ఒక ఎల‌క్ట్రానిక్ ఉప‌క‌ర‌ణం అందుబాటులోకి రానుంది. ఇది శ‌రీర వాస‌న‌ను గ్రహించి ఆ ప్రాంతంలో వైర‌స్ ఉన్న‌దీ, లేనిదీ సూచించి మ‌నల్ని అల‌ర్ట్ చేస్తుంది. యూకేకి చెందిన శాస్త్ర‌వేత్త‌లు ఈ ప‌రిక‌రాన్ని అభివృద్ధి చేశారు. ఈ ప‌రిక‌రానికి కోవిడ్ అలారం అనే పేరు పెట్టారు.


లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ శాస్త్ర‌వేత్త‌లు, డర్హమ్ యూనివర్శిటీ శాస్త్ర‌వేత్త‌లు ప‌రిశోధ‌న‌లు చేసి ఈ ప‌రిక‌రాన్ని  క‌నుగొన్నారు. కోవిడ్‌- 19 సోకిన‌పుడు శ‌రీరం నుంచి వ‌చ్చే ఒక నిర్దిష్ట వాస‌న‌ను ఈ ప‌రిక‌రంలోని సెన్సార్లు గుర్తిస్తాయి. ఈ సంద‌ర్భంగా లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ ప్రొఫెస‌ర్ మాట్లాడుతూ  ఈ ప‌రిక‌రానికి సంబంధించిన ప్ర‌యోగ ఫ‌లితాలు ఆశాజనకంగా ఉన్నాయి. ఫ‌లితాలు కూడా ఖ‌చ్చితంగా వ‌స్తున్నాయి. ఈ ప‌రిక‌రాన్ని జ‌న‌స‌మూహం ఉండే ప్ర‌దేశాల్లో ఇన్‌స్టాల్ చేస్తే ఈ మ‌హ‌మ్మారి వ్యాప్తి నుంచి ప్ర‌జ‌ల‌ను త్వ‌ర‌గా ర‌క్షించ‌వ‌చ్చ‌ని తెలిపారు. 

Updated Date - 2021-06-14T11:11:43+05:30 IST