లాక్‌డౌన్ పొడిగించాలని కోరుకుంటున్నారా అన్న యూసీ బ్రౌజర్ ప్రశ్నకు...

ABN , First Publish Date - 2020-04-11T01:28:20+05:30 IST

చైనాకు చెందిన మొబైల్ ఇంటర్నెట్ సర్ఫింగ్ అప్లికేషన్ యూసీ బ్రౌజర్ భారత్‌లో అమలవుతున్న లాక్‌డౌన్‌పై...

లాక్‌డౌన్ పొడిగించాలని కోరుకుంటున్నారా అన్న యూసీ బ్రౌజర్ ప్రశ్నకు...

మొబైల్ ఇంటర్నెట్ సర్ఫింగ్ అప్లికేషన్ యూసీ బ్రౌజర్ భారత్‌లో అమలవుతున్న లాక్‌డౌన్‌పై డిజిటల్ ఫ్లాట్‌ఫామ్ వేదికగా చేసిన సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. ఈ సర్వేలో భారత్‌లోని 76 శాతం డిజిటల్ యూజర్లు లాక్‌డౌన్‌ పొడిగింపు దిశగానే కేంద్రం నిర్ణయం ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు యూసీ బ్రౌజర్ స్పష్టం చేసింది.


తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మలయాళం, తమిళ్, మరాఠీ, గుజరాతీ, కన్నడ, బెంగాలీ, పంజాబీ భాషల్లో లాక్‌డౌన్‌పై డిజిటల్ యూజర్లకు యూసీ ప్రశ్నలు సంధించింది. వారి అభిప్రాయాలను సేకరించింది. ఈ సర్వేలో 1,22,679 మంది పాల్గొన్నారు. మీరు లాక్‌డౌన్ పొడిగించాలని కోరుకుంటున్నారా అనే ప్రశ్నకు 92,149 మంది అవునని సమాధానమిచ్చారు. కేవలం 30,510 మంది మాత్రమే 21 రోజుల లాక్‌డౌన్ ఏప్రిల్ 14తో ముగుస్తుందని అభిప్రాయపడ్డారు.


ఇదిలా ఉంటే.. లాక్‌డౌన్ పొడిగింపునకు సంబంధించి కేంద్రం ప్రకటన రాక ముందే రెండు రాష్ట్రాలు ఇప్పటికే లాక్‌డౌన్‌ను ఈ నెలాఖరు వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఒడిశా, పంజాబ్ రాష్ట్రాల్లో కేబినెట్ సమావేశాలు నిర్వహించిన అక్కడి ప్రభుత్వాలు అనంతరం తమ రాష్ట్రాల్లో ఏప్రిల్ 30వరకూ లాక్‌డౌన్‌‌ను పొడిగిస్తున్నట్లు స్పష్టం చేశాయి.

Updated Date - 2020-04-11T01:28:20+05:30 IST