Advertisement
Advertisement
Abn logo
Advertisement

పిల్లలకు ఎలాంటి మాస్క్‌లు?

ఆంధ్రజ్యోతి(01-09-2020): మాస్క్‌ విషయంలో పిల్లల వయసును బట్టి నియమాలు పాటించాలి. ఆ నియమాలు ఇవే!


ఐదేళ్లు అంతకన్నా పెద్ద పిల్లలకు మూడు పొరల మాస్క్‌ వాడాలి.


ఐదేళ్ల కన్నా తక్కువ వయసు పిల్లలకు మాస్క్‌ పెట్టడం వల్ల వారికి అందే ఆక్సిజన్‌ స్థాయి తగ్గుతుంది కాబట్టి వీరికి మూడు పొరల మాస్క్‌ వాడడం సరికాదు.


పిల్లలకు రెడీమేడ్‌ మెడికల్‌ మాస్క్‌లకు బదులుగా ఇంట్లో తయారుచేసిన మాస్క్‌లు, ఫేస్‌ కవర్లు వాడాలి.


మాస్క్‌లతో పిల్లలు అసౌకర్యానికి లోనవుతూ ఉంటే, వారి ముక్కు, నోరు కప్పేలా చేతి రుమాలునూ కట్టవచ్చు. అయితే అది పిల్లలు పీకేసుకోకుండా, ఊడిపోకుండా చూడాలి.


మాస్క్‌ వదులుగా, ఊడిపోయేలా ఉండకుండా, సందులు లేకుండా ముక్కు, నోటిని పూర్తిగా మూసేలా ఉండాలి. 

Advertisement

పిల్లల సంరక్షణమరిన్ని...

Advertisement