బాలికను గర్భవతిని చేసిన ఇద్దరు యువకులు

ABN , First Publish Date - 2022-07-04T05:47:43+05:30 IST

బాలికను గర్భవతిని చేసిన ఇద్దరు యువకులు

బాలికను గర్భవతిని చేసిన ఇద్దరు యువకులు

చేవెళ్ల, జూలై 3: మాయమాటలు చెప్పి ఇద్దరు యువకులు బాలికను గర్భవతిని చేసిన ఘటన చేవెళ్ల పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని ఓ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ హయూబ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన 16సంవత్సరాల బాలిక ఇంటర్‌ వరకు చదువుకుని ఇంటివద్దనే ఉంటోంది. అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు ఆ యువతితో స్నేహంగా ఉండేవారు. మాయమాటలు చెప్పి బాలికను లొంగదీసుకున్నారు. రెండు రోజుల క్రితం బాలికకు కడుపు నొప్పిగా ఉందని చెప్పడంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాలిక గర్భవతి అని వైద్యులు ధుృవీకరించారు. దీంతో తల్లిదండ్రులు బాలికను గట్టిగా నిలదీయడంతో అసలు విషయం బయటపెట్టింది. దీంతో బాలిక తల్లిదండ్రులు చేవెళ్ల పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

Updated Date - 2022-07-04T05:47:43+05:30 IST