టీనేజర్ కుర్రాళ్లే ఆ ఇద్దరు మహిళల టార్గెట్.. వారితో సినీఫక్కీలో ఏం చేయించేవారంటే..

ABN , First Publish Date - 2022-02-15T05:42:37+05:30 IST

ఓ నగరంలో వరుస దొంగతనాలు జరుగుతున్నట్లు పోలీసులకు ఫిర్యాదులందుతున్నాయి. దీంతో వారు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఏడుగురు యువకులను పట్టుకున్నారు. అందులో ముగ్గురు టీనేజర్లు. వారందరినీ విచారణ చేయగా...

టీనేజర్ కుర్రాళ్లే ఆ ఇద్దరు మహిళల టార్గెట్.. వారితో సినీఫక్కీలో ఏం చేయించేవారంటే..

ఓ నగరంలో వరుస దొంగతనాలు జరుగుతున్నట్లు పోలీసులకు ఫిర్యాదులందుతున్నాయి. దీంతో వారు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఏడుగురు యువకులను పట్టుకున్నారు. అందులో ముగ్గురు టీనేజర్లు. వారందరినీ విచారణ చేయగా.. ప్రపంచంలో ఎక్కడా వినని వింత విషయం పోలీసులకు తెలిసింది. పట్టుబడిన దొంగల వెనుక ఇద్దరు మహిళల ప్లానింగ్ ఉందని విచారణలో వెల్లడైంది.


వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని భిలాయి నగరంలో కొని నెలలుగా వరుస దొంగతనాల జరుగుతున్నట్లు పోలీసులకు ఫిర్యాదులందాయి. ఒక కొత్త గ్యాంగ్ పకడ్బందీగా దొంగతనాలు చేస్తోందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసుల మరింత నిఘా పెంచి ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఏడుగురు దొంగలను పట్టుకున్నారు. వారిలో ముగ్గురు టీనేజర్లు ఉన్నారు.


ఆ దొంగలను విచారణ చేసిన పోలీసులకు షాకింగ్ నిజాలు తెలిశాయి. నగరంలో టీనేజర్ల కుర్రాళను టార్గెట్ చేస్తూ వారిని దొంగతనం ఎలా చేయాలని ఒక స్కూల్‌లో శిక్షణ ఇస్తున్నారు. ఆ స్కూల్‌లో దొంగతనం ఒక టీమ్ వర్క్‌గా చేయాలని నేర్పిస్తారు. ఒకరు సొమ్ము దొంగతనం చేస్తే మరొకరు ఆ సొమ్ముని సురక్షిత ప్రదేశానికి చేరుస్తారు. దొంగతనం చేసే సమయంలో ఒక మూడో వ్యక్తి చుట్టుపక్కలంతా గమనిస్తూ ఉంటాడు. ఏదైనా సమస్య ఉంటే.. వెంటనే తప్పించుకునే మార్గం ఉంటుంది. ఇలా దొంగతనం చేయాలనే టిప్స్‌ను వీడియో రూపం చూపిస్తారు. ఈ శిక్షణను ఇచ్చే స్కూల్‌ను నిర్వహించేది ఇద్దరు మహిళలు. 


ఆ ఏడుగురు దొంగల నుంచి సమాచారం సేకరించిన పోలీసులు.. వెంటనే ఆ రాబరీ స్కూల్‌పై దాడి చేసి ఒక మహిళను కూడా అరెస్టు చేశారు. మరో మాస్టర్ మైండ్ మహిళ పరారీలో ఉంది.


Updated Date - 2022-02-15T05:42:37+05:30 IST