రాజ్యసభకు ఇద్దరు

ABN , First Publish Date - 2022-05-19T06:31:10+05:30 IST

రాజ్యసభకు ఇద్దరు

రాజ్యసభకు ఇద్దరు

జిల్లా నుంచి వ్యాపారవేత్తలకు దక్కిన అవకాశం

‘గాయత్రి’ రవి, ‘హెటిరో’ పార్థసారిధిరెడ్డిలను ఖరారు చేసిన సీఎం కేసీఆర్‌ 

నేడు నామినేషన్‌ వేయనున్న వద్దిరాజు రవిచంద్ర

ఖమ్మం, మే 18 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): ఊహించని విధంగా ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు వ్యాపారవేత్తలకు రాజ్యసభ అవకాశం దక్కింది. వారిలో పూర్వ వరంగల్‌ జిల్లాలో జన్మించి ఖమ్మంలో స్థిరపడిన ప్రముఖ గ్రానైట్‌ వ్యాపారి, తెలంగాణ గ్రానైట్‌ అసోసియేషన్‌ ముఖ్యనేతల్లో ఒకరైన గాయత్రి గ్రూప్‌ ఆఫ్‌ ఇండసీ్ట్రస్‌ అధినేత వద్దిరాజు రవిచంద్ర(గాయత్రిరవి) కాగా, మరొకరు ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కందుకూరుకు చెందిన హెటిరోడ్రగ్స్‌ అధినేత బండి పార్థసారధిరెడ్డి మరొకరు.పార్టీకి ఆర్థికంగా అండగా ఉంటున్న ఈ ఇద్దరు నేతలకు అభ్యర్థిత్వాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఖరారు చేయడంతో.. టీఆర్‌ఎస్‌ జిల్లా వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. గాయత్రి రవి చాలాకాలం కాంగ్రె స్‌లో కొనసాగి గత అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్‌ అర్బన అసెంబ్లీస్థానం నుంచి కాంగ్రెస్‌ తరపున పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఆతర్వాత టీఆర్‌ఎ్‌సలో చేరి ఖమ్మం, వరంగల్‌, మహబూబాబాద్‌ జిల్లాల్లో జరిగే పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తున్నారు.ఈ క్రమంలో అనతికాలంలోనే ఆయన సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌కు దగ్గరయ్యారు. బీసీ నేతగా ఎదిగిన వద్దిరాజు ఖమ్మం లోక్‌సభ ఎన్నికలు, స్థానిక సంస్థలు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల విజయానికి తనవంతు సహకారం అందించారు. దీంతో పాటు హుజూరాబాద్‌ ఎన్నికల సమయంలో పార్టీ ఇనచార్జ్‌గా వ్యవహరించి అక్కడ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ప్రచారంలో పాలుపంచుకున్నారు. గత స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖమ్మంనుంచి పోటీచేయాలని ఆశించగా.. తాతా మఽధు సూదనకు అభ్యర్థిత్వం దక్కింది. అయినా ఆ ఎన్నికల్లో వద్దిరాజు రవిచంద్ర టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలుపుకు కృషి చేశారు.ఉమ్మడిఖమ్మం, వరంగల్‌ జిల్లాల్లో బీసీ నేతగా గుర్తింపు పొందిన గాయత్రి రవికి రాజ్యసభ ఖరారవడంతో ఇరుజిల్లాల టీఆర్‌ఎస్‌ నాయకులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. అయితే నిజామాబాద్‌కు చెందిన మున్నూరుకాపు సామాజికవర్గానికి చెందిన డి.శ్రీనివాస్‌ టీఆర్‌ఎస్‌ తరపున రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ తర్వాత అదే సామాజిక వర్గానికి చెందిన రవిచంద్రకు రాజ్యసభ అవకాశమిస్తూ.. సీఎం బీఫాం అందించారు. దాంతో గాయత్రి రవి గురువారం తన నామినేసన దాఖలు చేయనుండగా.. జిల్లా నుంచి టీఆర్‌ఎ్‌సనేతలు, కార్యకర్తలు భారీగా తరలుతున్నారు. గ్రానైట్‌రంగంలో కీలకంగా ఎదిగిన గాయత్రి రవి మంత్రి గంగుల కమలాకర్‌కు దగ్గరి బంధువు. రాజ్య సభ అభ్యర్థులుగా బండి పార్థసారధి రెడ్డి, వద్దిరాజు రవిచంద్రను ఖరారు చేయడం హర్హనీయమని, దీంతో తమ బాధ్యత మరింత పెరిగిందని ఎమ్మెల్సీ తాతా మధుసూదన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. 


గాయత్రి రవి నేపథ్యం

పేరు : వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి)

తల్లిదండ్రులు : నారాయణ, వెంకటనర్సమ్మ

పుట్టినతేదీ : 1964 మార్చి 22

జన్మస్థలం: ఇనుగుర్తి, కేసముద్రం మండలం, మహబూబాబాద్‌జిల్లా 

విద్యార్హత: బీకాం, నివాసం: ఖమ్మం, వరంగల్‌, హైదరాబాద్‌

భార్య: విజయలక్ష్మి

కుమారుడు, కోడలు: నిఖిల్‌ సాయిచంద్ర, అనిల

కూతురు, అల్లుడు: గంగుల గంగాభవాని, సందీప్‌

వృత్తి : గ్రానైట్‌ వ్యాపారం

సంస్థ : గాయత్రి గ్రానైట్‌ గ్రూప్‌ కంపెనీస్‌, ఎండీ, ఖమ్మం, వరంగల్‌ 

ఇతర పదవులు: తెలంగాణ గ్రానైట్‌ క్వారీస్‌ అసోసియేసన రాష్ట్రఅధ్యక్షుడు, తెలంగాణ మున్నూరు కాపు జేఏసీ గౌరవ అధ్యక్షుడు

రాజకీయ నేపథ్యం: బీకాం వరకు చదువుకున్న రవిచంద్ర గ్రానైట్‌ వ్యాపారం నుంచి రాజకీయాల్లోకి వచ్చి చాలాకాలం కాంగ్రె్‌సలో కొనసాగారు.గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత టీఆర్‌ఎ్‌సలో చేరారు.


పార్టీ, ప్రజల కోసం కష్టపడి పనిచేస్తా : వద్దిరాజు 

పార్టీ, ప్రజల కోసం కష్టపడి పనిచేస్తానని రాజ్యసభ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా గురువారం నామినేషన వేయనున్న వద్దిరాజు రవిచంద్ర బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. గొప్పనాయకుడు కేసీఆర్‌ అని, ఆయన ఆశీస్సులతో రాజ్యసభ అభ్యర్థిగా ఎంపికవడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు.తనను ప్రొత్సహించిన ప్రతీఒక్కరికి ధన్యవాదాలని, గత లో క్‌సభ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల విజయానికి తనవంతు సహకా రం అందించానని, సేవకు గుర్తింపుగా తనకు ఈపదవి లభించిందన్నారు. 


సత్తుపల్లి ప్రాంతం నుంచి పార్ధసారధి

సత్తుపల్లి/వేంసూరు: రాష్ట్ర రాజకీయాల్లో సత్తుపల్లి నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇప్పటికే ఈ నియోజకవర్గం నుంచి అనేక మంది ప్రముఖులు రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రి, పార్లమెంట్‌ సభ్యులు, కేంద్రమంత్రిగా పనిచేసిన నాయకులున్నారు. తాజాగా సత్తుపల్లి నియోజకవర్గానికి రాజ్యసభకు ప్రాతినిధ్యం దక్కబోతోంది. గతంలో సత్తుపల్లి నియోజకవర్గం నుంచి జలగం వెంగళరావు, జలగం ప్రసాదరావు, తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర మంత్రులుగా పదవులను నిర్వహించారు. జలగం వెంగళరావు ముఖ్యమంత్రి పదవి అలంకరించారు. గతంలో జలగం కొండలరావు, జలగం వెంగళరావు పార్లమెంట్‌ సభ్యులుగా ఎన్నికయ్యారు. 2014లో సత్తుపల్లి నియోజకవర్గానికి చెందిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం నుంచి పార్లమెంట్‌ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం వేంసూరు మండలం కందుకూరు గ్రామానికి చెందిన హెటిరో డ్రగ్స్‌ అధినేత బండి పార్థసారధిరెడ్డికి అవకాశం లభించింది. దీంతో ఆయన సత్తుపల్లి నుంచి రాజ్యసభకు వెళుతున్న తొలి నాయకుడిగా నిలుస్తున్నారు. 


పార్థసారధిరెడ్డి బయోడేటా 

పేరు : బండి పార్థసారధిరెడ్డి

తల్లిదండ్రులు : సోమకాంతమ్మ, శ్రీనివాసరెడ్డి

భార్య : కళావతి, పిల్లలు: సింధు, వంశీకృష్ణ

పుట్టిన తేది : మార్చి 6, 1954

స్వగ్రామం : కందుకూరు, వేంసూరు మండలం

పాఠశాల విద్య : హైస్కూల్‌, కందుకూరు 

విద్య : సత్తుపల్లి జేవీఆర్‌ ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ, హైదరాబాద్‌ ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎ్‌ససీ ఆర్గానిక్‌ కెమెస్ర్టీ, అక్కడే పీహెచ్‌డీ పూర్తి చేశారు. 

నిర్వహించిన పదవులు: టీటీడీ ధర్మకర్తలి మండలి సభ్యుడిగా 2019లో నియామకం.

రాజకీయ నేపథ్యం: తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు కేసీఆర్‌, వైఎస్‌ జగన్‌తో సాన్నిహిత్యం

స్థిర నివాసం : హైదరాబాద్‌ సంస్థ: హెటిరో డ్రగ్స్‌ అధినేత

Updated Date - 2022-05-19T06:31:10+05:30 IST