కుక్కను తాళ్లతో కట్టి.. టిక్‌టాక్‌ కోసం యువకుల పైశాచికం

ABN , First Publish Date - 2020-05-25T21:19:23+05:30 IST

కుక్కు పైకి లేవకుండా దానిపై రాళ్లు విసిరారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెటా (పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్స్) ఆగ్రహం వ్యక్తం చేసింది. సదరు యువకుల్ని పట్టిస్తే 50 వేల రూపాయలు ఇస్తామని నజరానా ప్రకటించింది.

కుక్కను తాళ్లతో కట్టి.. టిక్‌టాక్‌ కోసం యువకుల పైశాచికం

న్యూఢిల్లీ: టిక్‌టాక్‌లో ఫైజల్ సిద్ధిఖీ వీడియో వైరల్ అయిన తర్వాత.. ఇండియాలో టిక్‌టాక్ బ్యాన్ చేయాలంటూ సోషల్ మీడియా ఉద్యమమే చేస్తోంది. లైకుల కోసమో, సహజ పైశాచికత్వమో.. కొందరు నెటిజెన్లు సోషల్ మీడియా వేదికగా చేసే కిరాతకాలు, అమానవీయ దృశ్యాలు చాలానే ఉన్నాయి. తాజాగా టిక్‌టాక్‌లో వెలుగు చూసిన ఓ వీడియో ఒక ఉదాహరణ. ఒక కుక్కను నాలుగు కాళ్లు కట్టేసి చెరువులో విసిరేశారు ఇద్దరు యువకులు. అంతే కాకుండా కుక్కు పైకి లేవకుండా దానిపై రాళ్లు విసిరారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెటా (పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్స్) ఆగ్రహం వ్యక్తం చేసింది. సదరు యువకుల్ని పట్టిస్తే 50 వేల రూపాయలు ఇస్తామని నజరానా ప్రకటించింది.


‘‘ఒక అనాగరిక చర్యను మేము కూడా గమనించాం. వారిని చట్ట ప్రకారం శిక్షించాలి. వారి వివరాలు తెలియజేయండి. వివరాలు తెలిపిన వారికి 50 వేల రూపాయల నజరానా ఇస్తాం’’ అని పెటా పేర్కొంది. అంతే కాకుండా +91 9820122602 లేదంటే e-mail Info@petaindia.org లకు నేరుగా సమాచారం ఇవ్వవచ్చని పేర్కొంది.



Updated Date - 2020-05-25T21:19:23+05:30 IST