రెండు నెలల చిన్నారి అనుమానాస్పద మృతి.. ఏం జరిగిందో..!?

ABN , First Publish Date - 2021-12-21T12:01:35+05:30 IST

రెండు నెలల చిన్నారి అనుమానాస్పద మృతి.. ఏం జరిగిందో..!?

రెండు నెలల చిన్నారి అనుమానాస్పద మృతి..  ఏం జరిగిందో..!?

హైదరాబాద్ సిటీ/బోయినపల్లి : రెండు నెలల చిన్నారి మృతి చెందింది. దీనిపై అనుమానాలు ఉన్నాయని పోలీసులకు తండ్రి ఫిర్యాదు చేశాడు. బోయినపల్లి సీఐ రవికుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. అమీర్‌పేట బీజేఆర్‌ కాలనీకి చెందిన ఎల్‌రాకేష్‌కు, న్యూబోయినపల్లి బాపూజీనగర్‌కు చెందిన వినీతతో 2019లో పెళ్లి జరిగింది. వారికి వేదశ్రీ (2), మిన్నీ అలియాస్‌ యోగిత (2 నెలల 9 రోజులు) పిల్లలున్నారు. కొంత కాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. బేగంపేట ఠాణాలో కౌన్సెలింగ్‌కు కూడా హాజరవుతున్నారు. ఈ నెల 4న మరోసారి గొడవ జరగడంతో వినీత పిల్లలను రాకేష్‌ వద్ద వదిలి వెళ్లింది. ఈనెల 6న రాకేష్‌ పిల్లలను తల్లికి అప్పగించాడు.


సోమవారం ఉదయం 9.30 కు వినీత సోదరుడు రాకేష్‌కు ఫోన్‌ చేశాడు. యోగిత ఆరోగ్యం బాగోలేదని, ఈఎస్ఐ కార్డు తీసుకొని సనత్‌నగర్‌ రావాలని కోరాడు. బోయినపల్లిలో రెండు ప్రైవేటు ఆస్పత్రులకు తీసుకెళ్లామని, వారు గాంధీకి తీసుకువెళ్లమని చెప్పారని తెలిపాడు. రాకేష్‌ సూచన మేరకు యోగితను ఈఎస్ఐ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు చిన్నారి అప్పటికే మృతి చెందిందని తెలిపారు. దీంతో పాప మృతిపై అనుమానాలున్నాయని రాకేష్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చిన్నారికి పాలిచ్చే క్రమంలో ఊపిరాడక మృతి చెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

Updated Date - 2021-12-21T12:01:35+05:30 IST