కుల్గాం ఎన్‌కౌంటర్‌లో మరణించిన ఇద్దరు ఉగ్రవాదులకు కోవిడ్ పాజిటివ్

ABN , First Publish Date - 2020-07-05T23:07:02+05:30 IST

ప్రత్యక్ష పోరాటం చేయడం చేత కాని పాకిస్థాన్ దొంగ దెబ్బ తీస్తున్న సంగతి తెలిసిందే.

కుల్గాం ఎన్‌కౌంటర్‌లో మరణించిన ఇద్దరు ఉగ్రవాదులకు కోవిడ్ పాజిటివ్

శ్రీనగర్ : ప్రత్యక్ష పోరాటం చేయడం చేత కాని పాకిస్థాన్ దొంగ దెబ్బ తీస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఉగ్రవాదులను బాంబులతో పంపిస్తున్న పాకిస్థాన్ కరోనా వైరస్‌ను కూడా ఆయుధంగా వాడుకుంటోందా? అనే అనుమానం కలుగుతోంది. శనివారం జమ్మూ-కశ్మీరులోని కుల్గాం జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన ఇద్దరు ఉగ్రవాదుల్లో ఒకడు పాకిస్థాన్ జాతీయుడు. వీరిద్దరికీ కోవిడ్-19 సోకినట్లు నిర్థరణ అయింది. 


జమ్మూ-కశ్మీరు పోలీసు శాఖ అధికార ప్రతినిథి ఒకరు మాట్లాడుతూ, ఎన్‌కౌంటర్‌లో మరణించిన ఉగ్రవాదులకు నిబంధనల మేరకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. వీరి శాంపిల్స్ తీసుకుని కోవిడ్-19 పరీక్షలకు కూడా పంపినట్లు తెలిపారు. కోవిడ్-19 పరీక్షల నివేదికలు ఆదివారం వచ్చాయన్నారు. వీరిద్దరికీ కోవిడ్-19 పాజిటివ్ అని నిర్థరణ అయిందన్నారు. వీరిలో అలీ భాయ్ వురపు హైదర్ పాకిస్థానీయుడని, హిలాల్ అహ్మద్ మాలిక్ స్థానికుడని చెప్పారు. 


జమ్మూ-కశ్మీరులో ఉగ్రవాదులకు ఈ వ్యాధి ఉన్నట్లు నిర్థరణ కావడం ఇదే మొదటిసారి అని తెలిపారు. వీరి మృతదేహాలను ఉత్తర కశ్మీరులోని బారాముల్లాలో కోవిడ్-19 ప్రోటోకాల్ ప్రకారం ఖననం చేయనున్నట్లు తెలిపారు. 


Updated Date - 2020-07-05T23:07:02+05:30 IST