90 ఏళ్ల వృద్ధురాలిపై ఇద్దరి అత్యాచారం

ABN , First Publish Date - 2020-11-01T10:03:17+05:30 IST

‘కామంతో కళ్లు మూసుకుపోయాయ్‌’ అనే మాట ఆ కిరాతకుల విషయంలో అక్షరాలా నిజం. అమ్మమ్మ అనే పిలుపు తలదించుకునే ఈ ఘటన ఉత్తర త్రిపుర జిల్లాలో జరిగింది...

90 ఏళ్ల వృద్ధురాలిపై ఇద్దరి అత్యాచారం

అగర్తలా, అక్టోబరు 31: ‘కామంతో కళ్లు మూసుకుపోయాయ్‌’ అనే మాట ఆ కిరాతకుల విషయంలో అక్షరాలా నిజం. అమ్మమ్మ అనే పిలుపు తలదించుకునే ఈ ఘటన ఉత్తర త్రిపుర జిల్లాలో జరిగింది. ఓ 90ఏళ్ల వృద్ధురాలు ఒంటరిగా జీవిస్తోంది. ఈ నెల 24న రాత్రివేళ ఇద్దరు కామాంధులు ఆ వృద్ధురాలి ఇంట్లోకి ప్రవేశించారు. ఆమెపై అత్యాచారం చేశారు. వారిలో ఒకడు ఆమెను ’అమ్మమ్మా’ అని పిలుస్తాడు. విషయం తెలి సిన బంధువులు పోలీసులను ఆశ్రయించారు. నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Updated Date - 2020-11-01T10:03:17+05:30 IST