Abn logo
Sep 21 2020 @ 11:01AM

కేరళలో భారీ పేలుడు... ఇద్దరు కూలీలు దుర్మరణం

Kaakateeya

ఎర్నాకుళం: కేరళలోని ఎర్నాకుళంలో ఈరోజు ఉదయం భారీ పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటన మలయూర్‌లో తవ్వకాలు జరుపుతుండగా జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు మృతి చెందారు. మరికొందరు కూడా మృతి చెందివుండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపడుతున్నారు. కలాడీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ పేలుడు ఒక భవనంలో చోటుచేసుకంది. ఈ భవనాన్ని కూల్చివేసేందుకు ప్రయత్నిస్తుండగా భారీ పేలుడు సంభవించింది. మృతులను తమిళనాడుకు చెందిన పెరియానాన్, కర్నాటకకు చెందిన డీ నాగాగా పోలీసులు గుర్తించారు. 


Advertisement
Advertisement