యజమాని బెడ్రూంలో రూ.5 లక్షలు పెట్టడం చూసి.. ఆ పనిమనుషులిద్దరూ ఏం చేశారంటే..

ABN , First Publish Date - 2020-08-12T14:07:12+05:30 IST

పనిచేస్తున్న ఇంటికే కన్నం వేసిన మహిళ, బాలికను కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి నగదు, బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌. లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల

యజమాని బెడ్రూంలో రూ.5 లక్షలు పెట్టడం చూసి.. ఆ పనిమనుషులిద్దరూ ఏం చేశారంటే..

పనిచేస్తున్న ఇంటికే కన్నం ఇద్దరు నిందితుల అరెస్టు 


హైదర్‌నగర్‌, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): పనిచేస్తున్న ఇంటికే కన్నం వేసిన మహిళ, బాలికను కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి నగదు, బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌. లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, గుంటూరు జిల్లా, మెల్లవాగు గ్రామానికి చెందిన మారెచర్ల మేరి(40)కొన్నేళ్ల క్రితం భర్తతో కలిసి బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి హఫీజ్‌పేటలో నివసిస్తూ ఇళ్లలో పనిచేస్తోంది. ఆరు నెలల నుంచి కేపీహెచ్‌బీ కాలనీలో ఫార్చూన్‌ ఫీల్డ్‌, విల్లా నంబర్‌ 22లో ఉంటున్న ఎన్‌. శ్రీకాంత్‌రెడ్డి ఇంట్లో పనిచేస్తోంది.


ఆమెతో పాటు మరో బాలిక కూడా పనిచేస్తోంది. శ్రీకాంత్‌రెడ్డి వ్యాపారంలో వచ్చిన డబ్బులను బెడ్‌రూమ్‌లో కప్‌బోర్డులో పెట్టడం వీరు గమనించారు. ఇద్దరూ కలిసి రూ. 5 లక్షలు, బంగారు గాజులు, రెండు రింగ్‌లు దొంగిలించారు. చోరీ చేసిన సొమ్ముతో రూ. 3.30 లక్షలతో బంగారం కొన్నారు. మూడురోజుల క్రితం శ్రీకాంత్‌రెడ్డి నగదు, బంగారం పోయిందని గమనించి వారిద్దరినీ అడగగా తాము తీయలేదని చెప్పి సర్వెంట్‌ క్వార్టర్‌ ఖాళీ చేసి వెళ్లిపోయారు. శ్రీకాంత్‌రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించారు. నిందితుల నుంచి 59.107 గ్రాముల బంగారు నగలు, కాళ్ల పట్టీలు, రూ. 1.70 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మహిళను రిమాండ్‌కు, బాలికను జువెనైల్‌ హోంకు తరలించారు.  

Updated Date - 2020-08-12T14:07:12+05:30 IST