రెండు గెలల అరటి

ABN , First Publish Date - 2021-07-21T05:14:30+05:30 IST

అరటి చెట్టుకు ఒక్క గెల మాత్రమే ఉంటుంది.

రెండు గెలల అరటి
రైల్వేకోడూరు మండలం రెడ్డివారిపల్లె రైతు హరిక్రిష్ణ అరటి తోటలో ఒక చెట్టుకు రెండు గెలలు వచ్చిన దృశ్యం

అరటి చెట్టుకు ఒక్క గెల మాత్రమే ఉంటుంది. అయితే రైల్వేకోడూరు మండలం రెడ్డివారిపల్లెకు చెందిన శ్రీకారపు హరిక్రిష్ణ అరటి తోటలో ఒక అరటి చెట్టుకు రెండు గెలలు వచ్చాయి. ఒక గెలలో 11 జీబులు(హస్తాలు), రెండో గెలకు 13 జీబులు ఉన్నాయి. పొడవు కూడా మూడు అడుగులు ఉంది. ఇలా రెండు గెలలు రావడం చూసి చుట్టు పక్కల రైతులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై రైల్వేకోడూరు ఉద్యానశాఖాధికారి రేణుకాప్రసాద్‌ మాట్లాడుతూ ఈ అరటి చెట్టుకు జన్యు లోపాలు ఏమీ లేవని అన్నారు. సహజంగా మహిళలు గర్భం దాల్చినప్పుడు కవలలు ఎలా పుడతారో అలానే చెట్టు గర్భం నుంచి రెండు గెలలు వస్తాయని తెలిపారు. అయితే రెండు గెలలు వచ్చిన పిలకలను తీసుకుని టిష్యూకల్చర్‌ పిలకగా ప్రయోగం చేస్తే ప్రతి చెట్టుకు రెండు గెలలు వచ్చే అవకాశం ఉందన్నారు. రైతు హరిక్రిష్ణ మాట్లాడుతూ తాను ఎన్నో ఏళ్లుగా అరటి తోటలు సాగు చేస్తున్నానని, ఒక్క చెట్టుకు రెండు గెలలు రావడం ఇదే మొదటి సారని అన్నారు.

- రైల్వేకోడూరు 

Updated Date - 2021-07-21T05:14:30+05:30 IST