కరోనా మృతుడు నిర్మల్ సింగ్ కుమార్తెకు పాజిటివ్

ABN , First Publish Date - 2020-04-04T17:31:53+05:30 IST

:పద్మశ్రీ నిర్మల్‌సింగ్ కరోనా వైరస్ సోకి మరణించిన రెండు రోజుల తర్వాత, శనివారం ఆయన కుమార్తెకు కరోనా వైరస్ పాజిటివ్ అని పరీక్షల్లో తేలింది....

కరోనా మృతుడు నిర్మల్ సింగ్ కుమార్తెకు పాజిటివ్

జలంధర్ (పంజాబ్):పద్మశ్రీ నిర్మల్‌సింగ్ కరోనా వైరస్ సోకి మరణించిన రెండు రోజుల తర్వాత, శనివారం ఆయన కుమార్తెకు కరోనా వైరస్ పాజిటివ్ అని పరీక్షల్లో తేలింది. పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్ జిల్లా షహకట్ సబ్ డివిజన్ పరిధిలోని లోహియాన్ ఖాస్ పట్టణానికి చెందిన సిక్కు ఆధ్యాత్మిక గాయకుడు పద్మశ్రీ నిర్మల్ సింగ్ రెండు రోజులక్రితం కరోనా వైరస్ తో మరణించారు. నిర్మల్ సింగ్ విదేశాల నుంచి తిరిగివచ్చాక ఆయనకు కరోనా సోకి చికిత్స పొందుతూ మరణించారు. శనివారం ఉదయం నిర్మల్ సింగ్ కుమార్తెను వైద్యులు పరీక్షించగా ఆమెకు కూడా కరోనా వైరస్ సోకిందని తేలడంతో ఆమెను వెంటనే జలంధర్ నగరంలోని సివిల్ ఆసుపత్రికి తరలించారు.


శుక్రవారం కరోనా మృతుడు నిర్మల్ సింగ్ కు సన్నిహితులైన ఇద్దరికి కరోనా సోకిందని తేలింది. ప్రస్థుతం కరోనా వైరస్ సోకిన నిర్మల్ సింగ్ సన్నిహితులు ఇటీవల చంఢీఘడ్ నగరంలో జరిగిన మత ప్రార్థనల్లో పాల్గొన్నారని తేలింది. నిర్మల్ సింగ్ కుమార్తెకు కరోనా సోకిందని పంజాబ్ రాష్ట్ర ప్రత్యేక చీఫ్ సెక్రటరీ కరణ్ బీర్ సింగ్ సిద్ధూ శనివారం ట్వీట్ చేశారు. కరోనా సోకిన వారిని కలిసిన 16 మంది ఇతరులకు పరీక్షలు చేయగా వారికి కరోనా సోకలేదని తేలింది. పంజాబ్ రాష్ట్రంలో 59 మందికి కరోనా సోకగా, వారిలో ఐదుగురు మరణించారు.

Updated Date - 2020-04-04T17:31:53+05:30 IST