కాపీరైట్ ఫిర్యాదు.. ట్రంప్ పోస్టు చేసిన ఫొటోను తొలగించిన ట్విట్టర్

ABN , First Publish Date - 2020-07-03T01:38:19+05:30 IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేసిన ఓ ఫొటోను ట్విట్టర్ తొలగించింది. ఆ ఫొటోకు కాపీరైట్ క్లెయిమ్

కాపీరైట్ ఫిర్యాదు.. ట్రంప్ పోస్టు చేసిన ఫొటోను తొలగించిన ట్విట్టర్

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేసిన ఓ ఫొటోను ట్విట్టర్ తొలగించింది. ఆ ఫొటోకు కాపీరైట్ క్లెయిమ్ రావడంతోనే ట్విట్టర్ దానిని తొలగించినట్టు ‘న్యూయార్క్ టైమ్స్’ పేర్కొంది. గత నెల 30న ట్రంప్ ఓ మీమ్ పోస్టు చేస్తూ.. ‘‘వాస్తవానికి వారు నా తర్వాత కాదు, వారు మీ తర్వాత ఉన్నారు. నేను మీ దారిలోనే ఉన్నాను" అని ట్రంప్ ట్వీట్ చేశారు. దాంట్లో ట్రంప్ ఫొటో బ్యాక్ గ్రౌండ్‌లో ఉంది. ఆ బ్యాక్‌గ్రౌండ్ ఫొటోను ఓ ఫీచర్ ఆర్టికల్ కోసం 2015 న్యూయార్క్ టైమ్స్ ఫొటో గ్రాఫర్ తీశాడు. అప్పుడు ట్రంప్ అధ్యక్ష అభ్యర్థిగా ఉన్నారు. ఈ ఫొటోను తొలగించిన ట్విట్టర్.. న్యూయార్క్ టైమ్స్ నుంచి కాపీరైట్ క్లెయిమ్ రావడంతో తొలగించినట్టు వివరణ ఇస్తూ ట్వీట్ చేసింది. 


Updated Date - 2020-07-03T01:38:19+05:30 IST