ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ డౌన్.. యూజర్లకు కష్టాలు

ABN , First Publish Date - 2021-04-18T00:58:12+05:30 IST

మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ సేవలకు నేడు ప్రపంచవ్యాప్తంగా కొంతసేపు అంతరాయం ఏర్పడింది. ట్వీట్స్ చేయడంలో

ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ డౌన్.. యూజర్లకు కష్టాలు

న్యూఢిల్లీ: మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ సేవలకు నేడు ప్రపంచవ్యాప్తంగా కొంతసేపు అంతరాయం ఏర్పడింది. ట్వీట్స్ చేయడంలో ఇబ్బందులతోపాటు కొంతమంది యూజర్లు తమ ఖతాలోకి లాగిన్ కూడా కాలేకపోయారు. దీంతో నానా అవస్థలు పడ్డారు. తెల్లవారుజాము నుంచే ట్విట్టర్‌లో సమస్య ఎదురుకాగా.. ‘లోపం తలెత్తింది. మళ్లీ ప్రయత్నించండి’ అన్న మెసేజ్ స్క్రీన్‌‌పై దర్శనమిచ్చింది. అలాగే, ట్వీట్స్ ప్రస్తుతం లోడ్ కావడం లేదంటూ ఎర్రర్ మెసేజ్ కనిపించింది.


యూజర్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో స్పందించిన ట్విట్టర్.. సమస్యను సరిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని, త్వరలోనే మీరు టైమ్‌లైన్‌లోకి వస్తారని పేర్కొంది. ట్విట్టర్ డౌన్ కావడంతో చాలామంది యూజర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అయితే, ఆ తర్వాత కాసేపటికే ట్విట్టర్ మళ్లీ లైన్‌లోకి రావడంతో ఖాతాదారులు ఊపిరి పీల్చుకున్నారు.

Updated Date - 2021-04-18T00:58:12+05:30 IST